Cool Water: వేసవి కాలం మొదలవడంతో చాలామంది పెద్ద ఎత్తున దాహాన్ని తీర్చుకోవడం కోసం చల్లటి నీరు తాగుతూ ఉంటారు అయితే చాలా మంది ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టుకొని మరి తాగుతూ ఉంటారు బయటకు వెళ్లిన ఆ కూల్ వాటర్ తమతో పాటు తీసుకు వెళ్తూ ఉంటారు అలాగే చాలామంది ఈ వేసవి తాపం నుంచి బయటపడటానికి చల్ల చల్లని పానీయాలు తాగుతూ ఉంటారు. ఇలా వేసవి కాలంలో చల్లని పానీయాలు తాగటం వల్ల దాహం నుంచి బయటపడటమే కాకుండా మన శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.
ఇలా వేసవి కాలంలో చాలా చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండటమే కాకుండా మరిన్ని అనారోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుందని తెలుస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి నీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించడంతో పాటు మలబద్దకం, గ్యాస్ లాంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా కూల్ వాటర్ లో గుండెలోని వాగస్ నరాల పై ప్రభావం చూపి గుండె పోటుకు దారి తీస్తుంది. అంతే కాకుండా తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ వంటివి తీవ్రతరం అవుతాయి.
ఇక చాలామంది ఏదైనా ఆహారం తిన్న వెంటనే చాలా చల్లని నీటిని తాగుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. నాడీ వ్యవస్థ చల్లబడి పల్స్ రేట్, హార్ట్ బీట్ పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి నీరు కాకుండా కుండలో వేసినటువంటి చల్లని నీటిని తాగటం ఎంతో ఆరోగ్యకరం. ఇక చల్లటి నీరు శరీరంలో కొవ్వును పెంచుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది.