Fri. Jun 26th, 2026

    Health Tips: అమ్మాయిలు ఎంత అందంగా తయారైన వారి అందాన్ని రెట్టింపు చేసేది మాత్రం పెదాలు అని మాత్రమే చెప్పాలి. అందుకే అమ్మాయి అందం రెట్టింపు అవ్వటానికి వివిధ రకాల లిప్ స్టిక్ వాడుతూ తమ అందాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్లిన లేదా బయటకు వెళ్లిన కచ్చితంగా అమ్మాయిలు లిప్ స్టిక్ వాడుతూ ఉంటారు. అయితే ఇలా లిప్ స్టిక్ వాడటం వల్ల వారి అందం పెరగడం పక్కన పెడితే పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

     

    ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు సంబంధించి లిప్ స్టిక్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి తయారీలో హానికర రసాయనాలను ఉపయోగించటం వల్ల ఇవి క్యాన్సర్ రావడానికి కారణం అవుతున్నాయి. లిప్‌స్టిక్‌లలో రంగు, సువాసన, అది ఎక్కువసేపు పెదవులపై నిలిచి ఉండటం కోసం సీసం, కాడ్మియం, క్రోమియం వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు, రసాయనాలను ఉపయోగిస్తుంటారు. వీటిని మనం ఎక్కువసేపు  పెదాలపై వేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే నోట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవ్వటమే కాకుండా కొన్నిసార్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు రావడానికి కూడా కారణం అవుతుంది.

    Doctors warns  about Lipstick causes cancer know details
    Doctors warns  about Lipstick causes cancer know details

    Health Tips: లిప్ స్టిక్ లలో హానికరమైన రసాయనాలను..

    ముఖ్యంగా మార్కెట్లలో తక్కువ ధరకు లభించే లిప్ స్టిక్ లలో ఇలాంటి హానికరమైన రసాయనాలను అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. తద్వారా పెదాలు నలుపు రంగులోకి మారటం, దీర్ఘకాలిక హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే మార్కెట్లో లభించే లిప్ స్టిక్ వాడటం కంటే కూడా ఇంట్లో సహజ సిద్ధంగా బీట్రూట్, గులాబీ పువ్వులతో తయారు చేసుకున్న లిప్ స్టిక్ వాడటం వల్ల మన పెదాలు సహజ సిద్ధంగా ఎరుపుగా కనిపించటమే కాకుండా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు.