Spirituality: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇక చాలా మంది అప్పుల బాధలతో సతమతమవుతుంటారు ఇలాంటివారు అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు తొలగిపోతాయి. అయితే అప్పుల సమస్యతో బాధపడేవారు మామిడి చెక్కతో ఒక పీఠను తయారు చేయించుకోవాలి. ఇలా అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలంటూ స్నానం చేసే సంప్రదాయమైన దుస్తులను ధరించాలి.
ఇక ఈ మామిడి పీఠను చక్కగా శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఈ పీటపై తెల్లని వస్త్రం వేసి కలిశం ఏర్పాటు చేయాలి కలశం చెంబులో వేసే నీళ్లలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చ కర్పూరం వేసి దానిపైన మామిడాకులు పెట్టి కొబ్బరికాయని పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కలశం ఏర్పాటు అయిన తర్వాత 108 ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయాలి. అనంతరం ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఇక రాత్రి పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తిని కటిక నేలపైన పడుకోవాలి.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా స్నానం చేసి అమ్మవారి ముందు పెట్టిన ఆ పువ్వులు అలాగే ఇతర పూజ పదార్థాలన్నింటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి పారుతున్న నీటిలో వేయాలి అలాగే కలశం లో ఏర్పాటు చేసిన ఆ నీటిని ఒక బాటిల్లో వేసి ఉత్తరం దిశ వైపు వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి అయితే ప్రతి అమావాస్యకు ఇలా చేయటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.