Thu. Nov 13th, 2025

    Divi Vadthya: తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ షో ద్వారా ప్రత్యేకంగా దగ్గరైన నటి దివి వద్త్య మరోసారి వార్తల్లో నిలిచారు. ‘మహర్షి’, ‘గాడ్‌ఫాదర్‌’ వంటి సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాకపోయింది. కానీ బిగ్‌బాస్‌లో కనిపించిన కేవలం కొద్ది రోజులలోనే దివి అనేక మంది అభిమానులను సంపాదించగలిగింది. రియాలిటీ షో తర్వాత వచ్చిన పాపులారిటీతో కొన్ని వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో దివికి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల విడుదలైన ‘లంబసింగి’ చిత్రం కూడా నిరాశ పరిచింది.

    ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో దివి తనకు ఎదురైన కష్టాలను, పరిశ్రమలో జరిగిన అనుభవాలను పంచుకుంది. అవకాశాల కోసం ఎన్నో ప్రొడక్షన్ హౌజ్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని, తన శరీరాన్ని వారి స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మార్చుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలను చెప్పింది. “లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే బరువు పెరగాలని రకరకాల సూచనలు ఇచ్చారు. అవన్నీ తట్టుకుని ట్రాన్స్‌ఫర్మేషన్ చేశా,” అని చెప్పింది.

    divi-vadthya-the-fans-post-went-viral
    divi-vadthya-the-fans-post-went-viral

    Divi Vadthya: దివి పాజిటివ్ మైండ్‌సెట్‌తో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

    ఇంకా, ఒకసారి రవితేజ సినిమాలో తనను లీడ్ క్యారెక్టర్‌కి ఎంపిక చేసి “నీ హైట్, ఫిజిక్ సినిమాకు అసెట్ అవుతుంది” అని చెప్పారని కానీ చివరికి తనకు ఫోన్ కూడా తీసుకోకుండా తప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తనను ఎంతగా గాయపరిచిందో తెలిపింది. “ఇంటికెళ్లి షవర్ కింద నిలబడి మౌనంగా ఎన్నిసార్లు ఏడ్చానో” అంటూ తాను ఎదుర్కొన్న మానసిక వేదనను చెప్పింది.

    అయినప్పటికీ దివి పాజిటివ్ మైండ్‌సెట్‌తో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన ఫ్యాన్స్‌తో తరచూ కమ్యూనికేట్ అవుతోంది. ఇటీవల ఆమె చేసిన ఓ ఫొటోషూట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దివి ఇచ్చిన పోజులు, స్పష్టంగా కనిపించిన నడుము, ఎద అందాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

    ఈ ఫొటోస్‌పై నెటిజన్ల కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. “నీ అందం చూసి ఆస్తులు అమ్మేస్తా” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఏ దివి నుంచి వచ్చావ్ దివి” అంటూ ఇంకొకరు ఫన్నీగా స్పందించారు.

    ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాల్లో సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తూనే, తనదైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్లతో, గ్లామర్ పోజులతో దివి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.