Sun. Nov 16th, 2025

    Rayamana Movie: భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సంగీతాన్ని అందించడానికి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్‌తో పాటు హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ కలిసి పనిచేస్తుండటం విశేషం. ఇది భారతీయ మైతహిక చిత్రాల్లో ఓ మైలురాయిగా నిలవబోతోంది.

    తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఏఆర్ రెహమాన్, ‘‘ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో హన్స్ జిమ్మర్ లాంటి గొప్ప సంగీత దర్శకుడితో కలిసి పనిచేస్తానని నేనే కాదు, ఎవరూ ఊహించలేదు. రామాయణమనకున్న భారతీయ సంస్కృతి. ఇందులో అవకాశం రావడం గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మేమిద్దరం ఇప్పటికే లండన్, లాస్ ఏంజెల్స్, దుబాయ్‌లలో మ్యూజిక్ సెషన్లు నిర్వహించామని చెప్పారు. హన్స్ జిమ్మర్ భారతీయ సంస్కృతిపై ఎంతో గౌరవం చూపించారని, తనకు ఏదైనా అర్థం కాకపోతే “ఇది వెస్ట్రన్ స్టైల్‌లో కంపోజ్ చేయచ్చా?” అని అడుగుతారని తెలిపారు.

    rayamana-movie-a-history-making-project-with-both-of-them
    rayamana-movie-a-history-making-project-with-both-of-them

    Rayamana Movie: ‘రామాయణ’ సంగీత పరంగా చరిత్ర సృష్టించనుందని భావిస్తున్నారు.

    హన్స్ జిమ్మర్ హాలీవుడ్‌లో ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డ్యూన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు సంగీతం అందించారు. ఇప్పటికే ఆయన రెండు ఆస్కార్ అవార్డులు, ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. ఈ భారీ ప్రయోగంలో రెహమాన్‌తో కలిసి పనిచేయడం ద్వారా ‘రామాయణ’ సంగీత పరంగా చరిత్ర సృష్టించనుందని భావిస్తున్నారు.

    ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. మొత్తం మీద ఈ చిత్రం రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.

    rayamana-movie-a-history-making-project-with-both-of-them
    rayamana-movie-a-history-making-project-with-both-of-them

    ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెహమాన్, హన్స్ జిమ్మర్ కాంబినేషన్‌లో వస్తున్న సంగీతం, విశిష్టమైన తారాగణం, విపులంగా ఖర్చుపెట్టబడిన విజువల్ ప్రెజెంటేషన్ అన్నీ కలిపి ‘రామాయణ’ను కేవలం ఒక సినిమా కాకుండా ఓ గొప్ప సాంస్కృతిక ప్రాజెక్ట్‌గా నిలబెట్టే అవకాశం ఉంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.