Bald Ness: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో బట్టతల సమస్య ఒకటి చాలా మంది తమ బిజీ లైఫ్ లో ఉండటం వల్ల సరేనా ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు ఇలా ఎప్పుడైతే మన శరీరానికి పోషక విలువలతో కూడినటువంటి ఆహార పదార్థాలు అందవు అప్పుడు మనలో జుట్టు రాలే సమస్య అధికమవుతుంది అందుకే చాలామంది పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
ఎప్పుడైతే మన శరీరంలో జింక్ లోపిస్తుందో అప్పుడు జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి విటమిన్ డి, ఐరన్ చాలా ముఖ్యం. ఈ ఖనిజం లోపం ఉంటే జుట్టు రాలడం వేగంగా జరుగుతుంది. ఇందుకోసం మీకు ప్రతిరోజూ 11 mg జింక్ అవసరం. జింక్ ప్రతిరోజు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగిన మోతాదులో జింక్ లభించి జుట్టు ఆరోగ్యాన్ని ఎంతో పెంపొందించడానికి దోహదం చేస్తుంది మరి జింక్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..
వేరుశనగ వేరుశనగ పల్లిలో జింక్ శాతం అధికంగా ఉంటుంది. ఇందులో జింక్‌తో పాటు విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే చిక్కుడు గింజలను కూడా తరచూ మన ఆహారంలో భాగంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం చిక్కుడు గింజలలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి వీటితోపాటు పుట్టగొడుగులను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పుట్టుగొడుగులు ఔషధ గుణాలకు మూలమని చెప్పాలి. ఇది జుట్టుకు జింక్ ని అందిస్తుంది. ఇది కాకుండా ఈ సూపర్‌ఫుడ్‌లో ప్రోటీన్, పొటాషియం, భాస్వరం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి.