Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. జూలై 1 నుంచి దేశంలో 339 కరోనా కేసులు నమోదవడం షాకిస్తోంది. ప్రత్యేకించి.. కేరళలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఒక్క కేరళలోనే ఇప్పటివరకు 115 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఏపీలో కూడా ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ ఈ కరోనా కొత్త వేరియంట్ గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ కరోనా ఒమిక్రాన్ RF 5 అనే కొత్త వేరియంట్ అని వైద్యులు నిర్ధారించారు. ఈ వేరియంట్ కారణంగా పెద్దగా ప్రమాదాలు ఉండవని వైద్యులు నిర్ధారించారు.గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, ముక్కు కారటం,అలసట , బాడీపెయిన్స్ వంటివి RF 5 లక్షణాలుగా తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఇక ఈ వేరియంట్ భయపడాల్సిన అంత ప్రమాదకరమైనది కాదని అయినప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు.సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో RF 5 కేసులు వెలుగులోకి వచ్చాయి కానీ దీనివల్ల భయపడాల్సిన పనిలేదని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Covid 19: ఏపీలో 16 కరోనా కేసులు నమోదు..
ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, కడప జిల్లాల్లో 16 కరోనా కేసులు నమోదు కాగా,4 మృతి చెందారు. ఇక మృతి చెందిన వారు కూడా ఇదివరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారని వైద్యులు తెలియజేశారు. ఒక ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన వారందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు.

