Thu. Jul 2nd, 2026

    AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు చిక్కులు మొదలవుతాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి. మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగడంతో అమర్నాథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో విచారణను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన ఆయన పదే పదే గడువు కోరుతుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    మొదట్లో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు, అమర్నాథ్ స్పందన కాస్త ధీమాగానే కనిపించింది. తాము దేనికైనా సిద్ధమేనని, నోటీసులకు దీటుగా సమాధానం చెబుతామని ఆయన వర్గం నుంచి లీకులు వచ్చాయి. కానీ తీరా కమిషన్ ముందుకు వెళ్లాల్సిన సమయం దగ్గరపడేసరికి సీన్ రివర్స్ అయింది. తన వివరణకు అవసరమైన సమాచారం, ఆధారాలు సేకరించుకోవడానికి సమయం కావాలంటూ మొదట నెలాఖరు వరకు గడువు అడిగారు. కమిషన్ కూడా రాజ్యాంగబద్ధంగా ఆయన అభ్యర్థనను పరిశీలించి అవకాశం ఇచ్చింది. అయినా సరే, ఆ గడువు ముగిసే సమయానికి మళ్లీ మరోసారి వాయిదా కావాలని కోరడం రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది.

    ap-politics-deadline-after-deadline-why-is-amarnath-lagging-behind
    ap-politics-deadline-after-deadline-why-is-amarnath-lagging-behind

    AP POLITICS: అమర్నాథ్ ఎందుకంతలా వెనకడుగు వేస్తున్నారు? తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు 

    అసలు అమర్నాథ్ ఎందుకంతలా వెనకడుగు వేస్తున్నారు? తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, అవి కేవలం రాజకీయ విమర్శలే అని ఆయన గట్టిగా నమ్మితే.. నేరుగా కమిషన్ ముందుకు వెళ్లి తన వాదనను బలంగా వినిపించవచ్చు కదా? అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అందరిలో మెదులుతున్నాయి. ఒక మహిళా హోంమంత్రి కట్టుబొట్టు, ఆహార్యంపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఎవరికీ ఆమోదయోగ్యం కావు. ఇప్పుడు ఇలా పదే పదే విచారణకు ముఖం చాటేయడం చూస్తుంటే.. చట్టపరంగా ఎదురయ్యే కఠిన పరిణామాల పట్ల ఆయనలో తీవ్ర ఆందోళన మొదలైందనే వాదన బలంగా వినిపిస్తోంది.

    కాగా, గతంలో మహిళల పట్ల వైసీపీ నేతల వ్యవహార శైలి ఆ పార్టీకి రాజకీయంగా ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా సరే, పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా విచారణ సంస్థల ముందుకు వెళ్లకుండా కాలయాపన చేయడం అమర్నాథ్ వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు, పార్టీ ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తోంది. మరి తప్పు చేశానన్న అపరాధ భావమే ఆయనను కమిషన్ మెట్లు ఎక్కనివ్వకుండా అడ్డుకుంటోందా? లేక ఈ గడువుల వెనుక ఏదైనా న్యాయపరమైన వ్యూహం దాగి ఉందా? అన్నది ఇప్పట్లో తేలేలా లేదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.