Wed. Feb 11th, 2026

    Dimple Hayathi : డింపుల్ హయతి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు టాలీవుడ్ లో ఈ అమ్మడి ఎంట్రీ ఒక సెన్సేషన్ అని చెప్పాల్సిందే. ఒకే ఒక పాటతో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంది ఈ అందాల భామ. ఆ ఒక్క పాటతో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది. కుర్రాళ్ళ ఆల్ టైమ్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ఊపులతో, షేపులతో అందరినీ కట్టిపడేసింది భామ

    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress
    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress

    హరీష్ శంక‌ర్ దర్శకత్వంలో వ‌చ్చిన గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ మూవీలో ఐటమ్ సాంగ్‌తో వెండి తెరపైన ఎంట్రీ ఇచ్చింది. అమ్మడి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన ర‌వితేజ డింపుల్ హ‌యాతి ని తన మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఖిలాడి సినిమాలో ఓ వైపు గ్లామ‌ర్‌గా మ‌రో వైపు లంగా ఓణీ వేసుకుని తన పాత్ర‌కు న్యాయం చేసింది.

    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress
    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress

    ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న డిపుల్ లేటెస్ట్ గా రామబాణం సినిమాలో మెరిసింది. ఈ మూవీ లోను రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో అల‌రించింది. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా డింపుల్ మాత్రం తన వరకు పెర్ఫార్మన్స్ బానే చేసింది.

    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress
    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress

    ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పుకొచ్చింది “నాకు మొదటిసారి పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో ఎలాగైనా నా టాయిలెట్ ని నిరూపించుకోవాలని అనుకున్నా. ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతున్నప్పుడే ఒకేసారి మూడు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. చేస్తున్న సినిమాను పూర్తి చేశాకే మరో మూవీ చేయాలనుకున్న. మూడు సినిమాల‌ను వద్దనుకున్న. కానీ నా బ్యాడ్ లక్. 90 శాతం సినిమా పూర్త‌యిన త‌ర్వాత నేను చేస్తున్న సినిమాను ఆపేశారు. ఎలా రియాక్ట్ కావాలో తెలియ‌దు చాలా ఫీల్ అయ్యాను”.అని చెప్పుకొచ్చింది.

    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress
    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress

    డ్యాన్స్ పరంగా ఈ భామ ఇరగదీస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాల్లో తన డ్యాన్స్ తో ఫిదా చేసింది. ఇప్పుడేమో ఫ్యాషన్ తో అందరిని ఆకట్టుకుంటుంది హయతి. తాజాగా ఈ బ్యూటీ సిల్వర్ కలర్ అవుట్ ఫిట్ వేసుకొని అందరి చూపులను తన వైపు తిప్పుకుంటుంది. బొడ్డు అందాలు కనిపించేలా బోల్డ్ ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందరూ క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress
    dimple-hayathi-glamours-looks-in-amazing-silver-dress