Wed. Feb 11th, 2026

    Allu Arjun: స్టైలిష్ స్టార్ అనే బ్రాండ్ నుంచి ఐకాన్ స్టార్ అనే గుర్తింపు వరకు. అస్సలు వీడు హీరో ఏంటి అనే విమర్శ నుంచి హీరో అంటే అల్లు అర్జున్ లా ఉండాలి అనే బ్రాండింగ్ వరకు అల్లు అరవింద్ నట వారసుడి కెరియర్ లో  రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా విజేత, స్వాతిముత్యం, డాడీ సినిమాలలో నటించిన బన్నీ తరువాత గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే రాఘవేంద్రరావు లాంటి అగ్ర దర్శకుడితో చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ మూవీ సక్సెస్ అయ్యింది. అల్లు అర్జున్ నటనకి కూడా మంచి ప్రశంసలు లభించాయి. స్టార్ హీరోగా అవ్వాలని వచ్చినవాడు మొదటి మూవీలోనే లేడీ గెటప్ వేయడం నిజంగా సాహసమే అని చెప్పాలి.

    HBD Allu Arjun:స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్‌‌గా అల్లు అర్జున్ సినీ  ప్రస్థానం.. 20 ఏళ్లలో ఎన్నో మలుపులు.. | happy birthday icon star allu arjun  do you know about his film and ...

    కాని అల్లు అర్జున్ చేసి చూపించాడు. అయితే అతని లుక్ పరంగా చాలా విమర్శలు వచ్చాయి. అయితే రెండో సినిమా ఆర్యతో తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. హీరోగా ఎస్టాబ్లిష్ కావాలంటే తనకంటూ బ్రాండ్ ఉండాలని బన్నీ డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రతి సినిమాకి లుక్స్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా వేరియేషన్స్ చూపిస్తూ స్టైలిష్ స్టార్ అనే బ్రాండ్ సొంతం చేసుకున్నాడు. యూత్ అయితే అల్లు అరుణ్ కాస్ట్యూమ్స్ ని అనుకరిస్తారు. అలాగే అతను సినిమాలలో చెప్పే మేనరిజమ్ డైలాగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి.

    గంగోత్రి సినిమా చూసి ఇతను హీరోనా అన్నారు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ | allu  arjun, gangotri, pan india star, comment, film industry - Telugu Allu Arjun,  Gangotri, Pan India

    ఆర్యలో ఫీల్ మై లవ్ అన్నా, జులాయిలో దేవుడా అనే డైలాగ్ అయిన, మేడమ్ సార్ మేడమ్ అంతే అనే డైలాగ్ అయిన, తగ్గేదిలే అనే ఆటిట్యూడ్ డైలాగ్ అయిన బన్నీ స్టైల్ కారణంగా ఎక్కువగా జనంలోకి వెళ్ళాయి. ఇలా అల్లు అర్జున్ బ్రాండ్ కి ఒక యునిక్ ఐడెంటిటి వచ్చింది. అయితే తన ప్రతి అడుగులో కూడా అల్లు అర్జున్ కష్టం, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఆయా సినిమాలలో కూడా కూడా కనిపిస్తుంది.

    Allu Arjun reveals his fitness secret and shares a few tips

    అందుకే అల్లు అర్జున్ కెరియర్ ఫ్లాప్ లు చాలా తక్కువ. ఫ్లాప్ అయిన నిర్మాత కమర్షియల్ గా నష్టపోయింది అంటే ఒక్క వరుడు మూవీ మాత్రమే అని చెప్పాలి. కెరియర్ ఆరంభంలో గంగోత్రిలో లేడీ గెటప్ వేసిన అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమాలో కాళికాదేవి గెటప్ లో మెరిసి అందరికి షాక్ ఇచ్చాడు. ఎలాంటి లుక్ లో అయిన కనిపించడానికి తాను వెనుకాడను అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ఈ రోజు దేశంలోనే హైయెస్ట్ బ్రాండ్ వేల్యూ ఉన్న టాలీవుడ్ హీరోగా బన్నీ ఉన్నాడు.