Latest News: అనంత విశ్వంలో ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి మనలానే నక్షత్ర మండలాలు ఉంటాయి. ఆ నక్షత్ర మండలాల్లోకి ప్రవేశించడం మానవమాత్రుడికి సాధ్యం కాని పని అని మన సనాతన ధర్మం చెబుతుంది. అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కూడా చెబుతుంది. అయినా కూడా ఆశాజీవి అయిన మనిషి సౌరకుటుంబంలోనే కాకుండా ఇతర నక్షత్ర మండలాల్లో భూమిని పోలిక గ్రహాలు ఉన్నాయేమో అనే విషయాలని తెలుసుకోవడానికి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే సౌర కుటుంబంలో ఉన్న ఇతర గ్రహాలలో మానవ సమాజం బ్రతకడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా అనే విషయాలని అంచనా వేస్తున్నారు. దీనికోసం చాలా దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయిలు ఈ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నాయి.
అయితే ఇప్పటికి మానవ సమాజం నివసించడానికి పనికొచ్చే గ్రహాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అలాగే ఇతర గ్రహాలలో మనలాంటి జీవ ఉనికి ఉందేమో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు అది కూడా సాధ్యం కావడం లేదు. కాని అప్పుడప్పుడు సౌర కుటుంబానికి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయని మాత్రం గుర్తిస్తున్నారు. ఇప్పుడు అలాంటి సూపర్ ఎర్త్ ని కూడా అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో నాసా ఈ సూపర్ ఎర్త్ ని గుర్తించింది. ఈ సూపర్ ఎర్త్ భూమిని పోలి ఉండటంతో దీనిపై మానవ ఆవాసం సాధ్యం అవుతుందా అనే కోణంలో పరిశోధనలు చేశారు. సుమారు 200 వందల కాంతి సంవత్సరాల దూరం ఉంది. భూమి కంటే 1.8 రేట్లు పెద్దదైన ఈ సూపెర్ ఎర్త్ కి టీఓఐ-1075బీగా పేరు పెట్టారు. భూమి, శుక్రుడు, బుధ గ్రహాల తరహాలో రాతి ఉపరితలం ఉండటం ఈ గ్రహం ప్రత్యేకత.
ఇప్పటి వరకు కనుగొన్న ఎర్త్ ఫార్మాట్ గ్రహాలలో ఇది అతి పెద్దదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ గ్రహంపై మానవుని బరువు భూమిపై ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని, అలాగే టెంపరేచర్ 1050 డిగ్రీల సెల్సియస్ వరకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ గ్రహం ఉపరితలం అంతా లావాతో కప్పబడి ఉందని తెలిపారు. తన మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వలన ఈ స్థాయిలో ఆ సూపర్ ఎర్త్ మీద టెంపరేచర్ ఉందని చెబుతున్నారు. ఇక ఈ సూపర్ ఎర్త్ పై కేవలం 14.5 గంటల్లో ఒక రోజు పూర్తవుతుందని, హైడ్రోజన్, హీలియం కూడా ఈ గ్రహంపై ఉండటం వలన ఏలియన్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.