Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక పోషకాలతో నిండి ఉన్న పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం తెలిసిందే.ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఇలా ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఈ బొప్పాయి పండును వర్షాకాలంలో తినకూడదని చెబుతుంటారు మరి నిజంగానే ఈ పండు వర్షాకాలంలో తినకూడదా తింటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే..
బొప్పాయిలో “పైన్” అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో అజీర్తి, గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది. చర్మానికి, కళ్లకు కూడా మంచిది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ వర్షాకాలంలో తినేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చూచిస్తున్నారు. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల పండ్లపై బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా పెరుగుతాయి. ముఖ్యంగా కట్ చేసిన బొప్పాయి గంటల కొద్దీ బయట ఉంటే పాడైపోయే అవకాశం ఉంది. అందుకే బయట కొట్టిన జ్యూస్ లేదా కట్ ఫ్రూట్ తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Papaya In Mansoon: రాత్రి పూట బొప్పాయికి
వర్షా కాలంలో బొప్పాయి తినాలి అనుకుంటే మార్కెట్ నుండి తెచ్చిన బొప్పాయిని బాగా కడిగి, పై తొక్క తీసి, ఇంట్లోనే చిన్న ముక్కలుగా కట్ చేసి తినండి. పచ్చి బొప్పాయి వర్షాకాలంలో జీర్ణం కావడం కష్టం. బాగా పండిన పసుపు రంగు బొప్పాయినే తినడం మంచిది. వర్షా కాలంలో పగటిపూట బొప్పాయి తినడం మంచిది. రాత్రిపూట బొప్పాయి తింటే కొందరికి గ్యాస్, చలి చేస్తుంది.ఇక గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి అస్సలు తినకూడదు. అది గర్భస్రావానికి కారణం అవుతుంది. అలర్జీ ఉన్నవారు, అల్సర్ ఉన్నవారు డాక్టర్ ని అడిగి తినడం మంచిది. వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ సరైన జాగ్రత్తలు, శుభ్రత పాటించడం కూడా ఎంతో అవసరం.

