Fri. Jul 3rd, 2026

    Aksharabhyasam at TTD : సాధారణంగా కొత్తగా స్కూలుకు వెళ్లే పిల్లల కోసం తల్లిదండ్రులు అక్షర అభ్యాసం చేసిన తర్వాతనే పాఠశాలలలో వదులుతూ ఉంటారు. అయితే ఈ అక్షరాభ్యాసం చేయడం కోసం చాలామంది బాసర వెళుతూ ఉంటారు. ఇకపై బాసరలో మాత్రమే కాకుండా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అక్షరాభ్యాసం నిర్వహించబోతున్నట్లు టీటీడీ తెలియచేసింది. నేటి నుంచి ఈ కార్యక్రమాలు అమలులోకి రాబోతున్నాయి. అక్షర గోవిందం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్షరాభ్యాసంతో పాటు అన్నప్రాసన కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నట్లు టిటిడి తెలియజేసింది.

    టీటీడీ నిర్వహిస్తున్నటువంటి ఈ అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. జులై మూడు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒక మంగళవారం మినహా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతిలోని శ్రీవకుల మాత ఆలయంలో నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే తల్లితండ్రులు సాంప్రదాయ దుస్తులలో వెళ్లాలి. ఇక గంట ముందు ఒకలా మాత ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

    Akshara govindam  and annaprasana services begins at tirupati on july 3 know details
    Akshara govindam and annaprasana services begins at tirupati on july 3 know details

    Aksharabhyasam at TTD: ప్రతిరోజు 50 మంది చిన్నారులకు మాత్రమే..

    ప్రతిరోజు 50 మందికి మాత్రమే వెసులుబాటు ఉంటుంది. రెండు బ్యాచ్ లలో ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఇక ఈ అక్షరాభ్యాసం పూర్తి అయిన తర్వాత చిన్నారులకు ఏడు వస్తువులతో కలిపిన ఒక కిట్ కూడా ఇవ్వబడుతుంది.రాతిపలక, బలపాల డబ్బాతో పాటు శ్రీవారి అక్షింతలు, అమ్మవారి పసుపు, కుంకుమ, ఆరు కంకణాలు, పటికబెల్లం(కలకండ) ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా వినాయకుడు, సరస్వతీదేవి, శ్రీ వేంకటేశ్వరస్వామితో కూడా చిత్రపటం ఈ కిట్ లో ఉంటుంది. ఇకపై అక్షరాభ్యాసం చేయించాలి అనుకునేవారు తిరుపతిలో కూడా తమ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని టీటీడీ తెలిపింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే తల్లిదండ్రులు కచ్చితంగా సాంప్రదాయ దుస్తులలోనే రావాలని తెలియజేశారు.