Thu. Jul 2nd, 2026

    Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ కొన్ని వేల వాహనాలు తిరుమల కొండ పైకి వెళ్తుంటాయి. ఇలా పెద్ద ఎత్తున వాహనాలు కొండ పైకి వెళ్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు . తిరుమల కొండ పైకి మీ సొంత వాహనాలలో వెళ్తున్న లేదా కొండ పైకి వెళ్లే ఏ వాహనదారులు కూడా హారన్ కొట్టకూడదనే నియామాని టీటీడీ అమలులోకి తెచ్చింది.

    తిరుమల కొండ పై స్వామి వారి గోవింద నామస్మరణ తప్ప ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండకుండా భక్తులకు ఆలయ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది. సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల ఘాట్ రోడ్డుతో పాటు కొండపై వాహనదారులు హారన్ మోగించకూడదు. ఈ విషయాన్ని భక్తులకు తెలిసేలా తిరుమల ప్రధాన రహదారుల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులు, వాహనదారులు ఈ విషయాని గమనించాలని టీటీడీ కోరింది.

    No Horon zone in tirumala TTD introduce new rule for devotees know details
    No Horon zone in tirumala TTD introduce new rule for devotees know details

    Tirumala: శబ్ద కాలుష్య నివారణ 

    ఈ నియమం భక్తులు వెళ్ళే వాహనాలకు మాత్రమే టీటీడీ వాహనాలకు, వీఐపీలకు కూడా వర్తిస్తుంది. వీఐపీ వాహనాలు, సైరన్ ఉపయోగించే వాహనాలు అత్యవసర సమయంలో మాత్రమే హారన్ ఉపయోగించాలని టీటీడీ తెలిపింది.ఇటీవల కాలంలో తిరుమలలో పెరుగుతున్న రద్దీ కారణంగా శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు ఈ నిబంధనలు పాటించాలని కోరింది. ఇక ఈ నిబంధనలు పాటించకపోతే జరిమాన విధించనున్నట్లు తెలిపారు. గతంలో కొండపైకి ప్రతి రోజు 8వేల వాహనాలు వెళ్లేవి. ప్రస్తుతం రద్దీ పెరగడంతో 10 వేల వరకు వాహనాలు కొండ పైకి వెళ్తున్నాయి. ఇక పండగలు, సెలవు దినాలు, ప్రత్యేక రోజులలో రద్దీ భారీగా పెరగడంతో కొండపై ఆధ్యాత్మిక వాతావరణం కంటే కూడా శబ్ద కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.