Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల కొండపై భక్తుల రద్దీ ఉన్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూలై రెండవ తేదీ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. జూలై 2 వ తేదీ దర్శనం కోసం జూలై ఒకటవ తేదీ SSD టోకెన్ లను జారీ చేయనున్నారు.
ఇక జూలై రెండో తేదీ దర్శనం చేసుకునే భక్తులకు నేడు SSD టోకెన్లను రద్దు చేసింది. నేడు (జూలై 1 వ తేదీ)SSD టోకెన్ కౌంటర్లను రద్దు చేస్తున్నట్టు టిటిడి తెలియజేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని కోరింది. జులై మూడవ తేదీ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు జూలై 3 వ తేదీ శుక్రవారం దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూలై 2 వ తేదీ అనగా గురువారం సాయంత్రం జారీ చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించగలరని టీటీడీ కోరింది.

Tirumala SSD Tokens: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
ఇక జూన్ 30వ తేదీ స్వామి వారి దర్శనం కోసం 80,160 మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. ఇందులో 28,270 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు. ఇక జూన్ 30వ తేదీ 4.1 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15 కంపార్ట్మెంటులలో భక్తుల దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. అలాగే SSD టోకెన్లు కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇలా తిరుమలలో రద్దీ ఉన్న నేపథ్యంలో నేడు విడుదల చేయాల్సిన SSD నిలిపివేసింది. ఇక కంపార్ట్మెంటులలో వేచి ఉన్న భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం నీరు, అన్న ప్రసాదం, పాలు వంటి సౌకర్యాలను టిటిడి కల్పిస్తోంది.

