Mon. Jun 29th, 2026

    Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల తర్వాత నేరేడు పండ్లు కూడా ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. ఇలా ఏడాదికి ఒకసారి లభించే ఈ పండ్లను తినకుండా ఎవరూ ఉండరు .అయితే చాలామంది నేరేడు పండ్లు తినడానికి పెద్దగా ఇష్టపడరు. తినడానికి కాస్త వగరు,తీపిగా ఉండే ఈ పండ్లను ఆరోగ్య సంజీవని అని పిలుస్తారు. అయితే ఈ పండ్లను తినడానికి ఇష్టపడని వారు ఈ విషయాలు తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు. మరి నేరేడు పండ్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..

    నేరేడు పండ్లలో లభించే జంబోలిన్ అనే పదార్థం శరీరంలోని పిండి పదార్థాలను చెక్కరలుగా మారకుండా అడ్డుకుంటుంది తద్వారా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అందుకే మధుమేహంతో బాధపడేవారు ఈ పండ్లను తినటం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. నేరేడు పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇలా పీచు పదార్థం అధికంగా ఉండడంతో మలబద్ధకం నివారణకు ఎంతగానో దోహదపడుతుంది అలాగే జీర్ణక్రియ సమస్యలను కూడా రాకుండా అడ్డుకుంటుంది.

    Do you know health benefits of jamun Fruits know more details
    Do you know health benefits of jamun Fruits know more details

    Jamun Fruits: నేరేడు రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

    నేరేడు పండ్లలో లభించే పొటాషియం గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడానికి దోహదపడుతుంది. ఇక ఈ పండ్లలో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడమే కాకుండా విటమిన్ సి కారణంగా రోగనిరోధక శక్తి కూడా పెంపొంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. చర్మంపై ఏర్పడిన మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మం కాంతివంతంగా కనిపించడంలో కూడా నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలు ముడతలను తగ్గించి చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. ఇక కేవలం నేరేడు పండ్లు మాత్రమే కాకుండా ఈ చెట్టుకు సంబంధించిన ఆకులు బెరడు కూడా నోటి పూత, నోట్లో రక్తస్రావం వంటి వాటికి ఎంతగానో సహాయపడుతుంది అలాగే నోటి దుర్వాసన రాకుండా కూడా అడ్డుకుంటుంది.