Sun. Jun 28th, 2026

    Vitamin D Deficiency: మనం ఆరోగ్యవంతంగా ఉంటూ మన రోజు వారి పనులు ఏ విధమైనటువంటి అలసట లేకుండా ఉండాలి అంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందినప్పుడే చాలా చురుగ్గా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలం. మనం ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ల లోపం ఉంటే కనుక మన శరీరం పూర్తిగా నీరసించిపోతుంది అయితే మనం చురుగ్గా ఉండాలంటే కండరాల పనితీరు మెరుగ్గా ఉండాలన్న మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. మన శరీరంలో ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే ఖచ్చితంగా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

     

    ప్రతిరోజు 8 గంటలు సరిపడా నిద్ర పోయినప్పటికీ అలసటగా అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా విటమిన్ డి లోపం ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి లోపించినప్పుడు మన శరీరంలో కండరాలు శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయలేవు తద్వారా ఎప్పుడు అలసటగా నీరసంగా ఉంటుంది. కండరాల బలహీనత కారణంగా కాసేపు నడిచిన లేదా మెట్లు ఎక్కిన ఆయాసంగా ఉండటం, ఎక్కువసేపు కూర్చున్న తిరిగి లేవ లేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చాలామంది కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేస్తూ ఉంటారు. ఇలా కూర్చునే సమయంలో విపరీతమైన నడుం నొప్పి రావడం వల్ల మనం కూర్చున్న భంగిమ సరిగా లేకపోవడం వల్లే నడుము నొప్పి వచ్చిందని భావిస్తారు కానీ విటమిన్ డి లోపం కారణంగా కూడా నడుము నొప్పి సమస్య వెంటాడుతుంది.

    Do you have these symptoms your body indicates a Vitamin D deficiency know details
    Do you have these symptoms your body indicates a Vitamin D deficiency know details

    Vitamin D Deficiency: విటమిన్ డి సప్లిమెంట్స్..

    మన శరీరంలో క్యాల్షియం సోషణకు విటమిన్ డి ఎంతో అవసరం ఎప్పుడైతే విటమిన్ డి లోపిస్తుందో తీవ్రమైన నడుము నొప్పి ఉంటుంది. విటమిన్ డి లోపం కారణంగా రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా చిన్నచిన్న ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ప్రమాదకరమైన జబ్బులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే విటమిన్-డి సమస్య ఉన్నట్లేనని అర్థం. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం ప్రతిరోజు ఉదయం సూర్య కిరణాలు మన శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విటమిన్ డి క్యాప్సిల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డి క్యాప్సూల్స్ తీసుకోవడం అలాగే విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.