Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇప్పటికే టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సరైన వసతులను ఏర్పాటు చేస్తోంది. అయితే తాజాగా స్వామివారి దర్శన విషయంలో వయోవృద్ధులకు టీటీడీ శుభవార్తను తెలియజేసింది. ప్రతిరోజు 1000 మంది వృద్దులకు దివ్యాంగులకు ఉచిత దర్శనం కల్పించబోతున్నట్లు టిటిడి తెలియజేసింది. ఇలా ఫ్రీగా దర్శనం చేసుకోవడం కోసం మూడు నెలలు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలియచేసింది.
ఆన్లైన్ ద్వారా మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకుని వెసులుబాటును కల్పిస్తుంది. తిరుమలలోని నంబి ఆలయం వద్ద సీనియర్ సిటిజన్ల ప్రత్యేక దర్శనం క్యూలైన్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ దర్శనం కోసం ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి 50 రూపాయల లడ్డు కూడా ఉచితంగా అందించబోతున్నట్లు తెలిపారు.

Tirumala: వృద్ధులకు టీటీడీ శుభవార్త..
వయోవృద్ధులు దర్శనం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను మోసాలను నమ్మొద్దు అంటూ టీటీడీ కీలక సూచనలు చేయడమే కాకుండా ఈ దర్శనం కోసం వయోవృద్ధులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org,https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించాలని సూచించింది. సోషల్ మీడియాలో ఎవరైనా ఈ దర్శనాల పట్ల మోసాలకు పాల్పడితే వెంటనే టీటీడీ హెల్ప్‌లైన్ నెంబర్ 155257కు కాల్ చేయాలని భక్తులకు సూచనలు చేశారు. ఇలా ఉచిత దర్శనం ద్వారా ఎంతో మంది వృద్ధులు దివ్యాంగులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే వెసులుబాటును తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించడంతో భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

