Mon. Jun 22nd, 2026

    Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలోకి వచ్చి రావడం తోనే బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపం చూపిస్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయో.. దాదాపు అదే స్థాయి రెస్పాన్స్‌తో ఈ సినిమా తొలిరోజే వసూళ్ల పరంగా దుమ్ము రేపింది. నెగిటివ్ షేడ్స్ లేని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజే సమంత కెరీర్‌లోనే సరికొత్త మైలురాయిని క్రియేట్ చేసింది.

    ఈ సినిమా కథాంశం 90ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుంది. ఒక పెద్ద కుటుంబంలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన ఓ సాదాసీదా అమ్మాయి కథ ఇది. అయితే ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి ఆమె పడే ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఆమె వెనుక ఉన్న ‘బాషా’ రేంజ్ మాస్ ఫ్లాష్‌బ్యాక్ ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల అంచుల మీద కూర్చోబెడుతోంది. సాధారణంగా ‘అతడు’, ‘జల్సా’ వంటి చిత్రాల్లో హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే కమర్షియల్ ఎలిమెంట్స్‌ను.. ఇందులో హీరోయిన్ కోణంలో ప్రెజెంట్ చేయడం ఆడియన్స్‌కు ఒక సరికొత్త ఫీల్‌ను ఇస్తోంది.

    sam-maa-inti-bangaaram-collections
    sam-maa-inti-bangaaram-collections

    Tollywood: సమంత వన్-మ్యాన్ షోతో కుమ్మేసిందని చెప్పాలి. 

    సినిమాలో సమంత వన్-మ్యాన్ షోతో కుమ్మేసిందని చెప్పాలి. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా మాస్ ఎలివేషన్స్‌లో సామ్ పెర్ఫార్మెన్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కొంతమందికి రొటీన్‌గా అనిపించినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు కథను నడిపించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్‌ను భారీగా థియేటర్ల వైపు రప్పిస్తోంది.

    ఇక వసూళ్ల విషయానికి వస్తే.. ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ మార్క్‌ను క్రాస్ చేసి.. ఏకంగా రూ. 12 కోట్ల రేంజ్ గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్స్ అండ్ డే 1తో కలిపి హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, దాదాపు రూ. 6 కోట్ల ఓపెనింగ్స్‌తో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని స్టార్ట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. వీకెండ్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.