Wed. Jun 17th, 2026
    CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), default quality?

    Health care: సాధారణంగా మనం బయటకు వెళ్లి ఏదైనా ఆహార పదార్థాలు లేదా స్నాక్స్ వంటివి తినే సమయంలో చాలామంది న్యూస్ పేపర్లో ఆహార పదార్థాలను పెట్టిస్తూ ఉంటారు. ఇలా న్యూస్ పేపర్ లో ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ చాలా మంది న్యూస్ పేపర్ లోనే ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఇక పై ఎవరు కూడా న్యూస్ పేపర్ లో ఆహార పదార్థాలను తినరు. మరి న్యూస్ పేపర్ లో ఆహార పదార్థాలను తినటం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..

    ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయం పేపర్లో హెచ్చరికలు జారీ చేసింది. హోటల్ రెస్టారెంట్స్ అలాగే వీధులలో దొరికే చిరు తిండి పదార్థాలను న్యూస్ పేపర్ పై పెట్టుకొని తినటం వల్ల ఆహారం విషంగా మారే అవకాశాలు ఉంటాయి. న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో ఉపయోగించే సిరాలో లెడ్, కాడ్మియం, పిగ్మెంట్స్ అలాగే మినరల్ ఆయిల్స్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. అందువల్ల మనం వేడివేడిగా ఆహార పదార్థాలను న్యూస్ పేపర్లో పెట్టుకొని తినటం వల్ల ఆహారం విషంగా మారే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Is it safe to eat food wrapped in newspaper know the side effects
    Is it safe to eat food wrapped in newspaper know the side effects

    Health Care: క్యాన్సర్ వచ్చే అవకాశాలు..

    ఈ ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. న్యూస్ పేపర్ లో ఉపయోగించే హెవీ మెటల్స్ మన శరీరంలో పేరుకు పోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతూ డామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే క్యాన్సర్ రావడానికి కూడా దోహదపడతాయి. పిల్లలు శారీరక ఎదుగుదలపై కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గించి అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది. అందుకే న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహార పదార్థాలను తినకపోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది.