Wed. Jun 3rd, 2026

    Politics: రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. అయితే ఈసారి పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వినిపించిన ఒక వాయిస్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు తెరలేపింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె నేరుగా జగన్‌ను సమర్థించకపోయినా, అమరావతి విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కానీ, పార్టీలోని సీనియర్లలో మాత్రం ఇది సరికొత్త టెన్షన్‌కు దారితీస్తోంది.

    గతంలో తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్‌రావు ఏపీ రాజకీయాలపై స్పందించిన తీరును వైసీపీ నేతలు ఇంకా మర్చిపోలేదు. ఒకప్పుడు జగన్‌తో సఖ్యతగా ఉంటూనే, సమయం చూసి ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. ఇక కేంద్రం ఇచ్చే నాలుగు వేల కోట్ల అప్పు కోసం జగన్ సర్కార్ రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడుతోందంటూ హరీష్‌రావు చేసిన విమర్శలు వైసీపీని తీవ్రంగా ఇరుకున పెట్టాయి. మిత్రులు అనుకున్నవారే అలా ఊహించని షాక్ ఇవ్వడంతో, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీలోని ఒక వర్గం పూర్తిగా నమ్మలేకపోతోంది.

    politics-kavitas-entry-new-tension-in-ycp
    politics-kavitas-entry-new-tension-in-ycp

    Politics: కవిత చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వంపై

    ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించాలని కొందరు వైసీపీ నేతలు ఉత్సాహపడుతున్నారు. ఇది తమకు దొరికిన పొలిటికల్ బూస్ట్ అని భావిస్తున్నారు. అయితే, పార్టీలోని మరికొందరు పెద్దల వాద‌న మ‌రోలా ఉంది. ఇప్పుడు కవిత మాటలకు పొంగిపోతే.. రేపు పొద్దున మళ్లీ వారే తిరగబడితే సమాధానం చెప్పుకోలేం అన్న‌ది వైసీపీ అంతర్గత వర్గాల్లో నడుస్తున్న టాక్. ఈ నేప‌థ్యంలోనే పొరుగు రాష్ట్ర నేతల మద్దతు ఎప్పుడూ తాత్కాలికమేనని, వారిని నమ్ముకుని ఏపీలో రాజకీయం చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, కవిత ఇచ్చిన ఈ సపోర్ట్ వైసీపీలో ఆనందం కంటే.. మున్ముందు ఎలాంటి ముప్పు తెస్తుందోనన్న టెన్షన్‌ను ఎక్కువగా పెంచుతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.