Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో పోల్చి చూసుకుంటే బాలయ్య నుంచి వస్తున్న చిత్రాలు, సక్సెస్‌లు ఎక్కువ శాతమే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150 నుంచి చిరంజీవి చేసిన చిత్రాలలో కంబ్యాక్ మూవీ మెగా 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్‌గారు మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకున్నాయి. బాలయ్య మాత్రం గత ఏడాది వచ్చిన అఖండ 2 తప్ప మిగతావన్నీ నిర్మాతలకి కాసుల వర్షం కురిపించినవే.
ప్రస్తుతం, బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీని చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార బాలయ్య సరసన మరోసారి జతకట్టింది. వీరి కాంబోకి ఉన్న క్రేజ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే, బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో వీరసింహారెడ్డి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో బాలయ్య-గోపీచంద్ మలినేని-నయనతార కాంబో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణతో కొరటాల సినిమా
మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ..ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో వరుసగా భారీ కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. అయితే, మెగాస్టార్ చిరంజీవితో, రామ్ చరణ్‌లతో చేసిన ఆచార్య సినిమా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇది, కొరటాలకి గట్టి దెబ్బ అని చెప్పాలి. అయినా కూడా NTR ఛాన్స్ ఇవ్వడంతో దేవర సినిమాను తీశాడు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ..కాస్త ఈ మూవీతో ఊరట లభించింది. ఇక, ఇదే సినిమాకి సీక్వెల్ గా దేవర 2 ఉంటుందని రెండేళ్ళ నుంచి వాస్ర్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తాజాగా ఇప్పట్లో ఈ మూవీ ఉండదని తేలిపోయింది.
కొరటాలకి బాలయ్య బిగ్ ఆఫర్:
నందమూరి బాలకృష్ణతో కొరటాల ఓ సినిమాను చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మే 1వ తేదీన ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఉండబోతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొరటాల కథ మాస్ అండ్ యాక్షన్ జోనర్ లో మాత్రమే కాకుండా క్లాస్ కూడా మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి, బాలయ్య-కొరటాల సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవడం ఖాయం. త్వరలో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన ఇతర కాస్ట్ అండ్ క్రూ..కథా నేపథ్యం తెలిసే అవకాశం ఉంది. కాగా, ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు.

