Sun. Apr 19th, 2026

    Dil Raju: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా పటాలెక్కబోతుందనే అఫీషియల్ న్యూస్ ఇది వరకే వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోన్న విషయాన్ని దిల్ రాజు బృందం ఇంతకముందే కన్‌ఫర్మ్ చెసింది. తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఆ డీటేయిల్స్ ఇప్పుడు చూద్దాం.

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వెలుగుతున్న దిల్ రాజు, హిందీ ఇండస్ట్రీలో స్ట్రైట్ సినిమాను నిర్మిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్‌మెంట్ రాగా, ఈ శనివారం ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, నయనతారలపై కీలకమైన సన్నివేశాలను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ షెడ్యూల్ నెలరోజుల పాటు జరపనున్నారు.

    dil-raju-salman-and-nayans-movie-is-launching-why-in-mumbai
    dil-raju-salman-and-nayans-movie-is-launching-why-in-mumbai

    Dil Raju: నిర్మాత దిల్ రాజుకి ఇది పెద్ద ప్రస్టేజియస్ ప్రాజెక్ట్.

    ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి స్టైల్లో రూపొందిస్తున్నాడు. బలమైన కథ, కథనాలతో.. హెవీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇంతకముందు తమిళ హీరో విజయ్‌తో దిల్ రాజు తెలుగు-తమిళంలో కలిపి ఇదే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాను నిర్మించాడు. తమిళంలో వారిసు పేరుతో రిలీజైంది. అయితే, ఆశించిన విజయం ఈ మూవీకి దక్కలేదు. నిర్మాతగా దిల్ రాజుకి నష్టాలను మిగిల్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ అందుకున్న దిల్ రాజు..అదే సమయంలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీతో భారీ నష్టాలను చూశాడు.

    ఈ ముగ్గురికీ హిట్ తప్పనిసరి:

    ఇటీవలి కాలంలో నిర్మాతగా దిల్ రాజు, దర్శకుడిగా వంశీ పైడి పల్లి, హీరోగా సల్మాన్ ఖాన్‌లకి సక్సెస్‌లు దక్కలేదు. ఇలాంటి సమయంలో వీరు ముగ్గురు కలిసి సినిమా చేయడం అతిపెద్ద సాహసం. ముఖ్యంగా, నిర్మాత దిల్ రాజుకి ఇది పెద్ద ప్రస్టేజియస్ ప్రాజెక్ట్. సల్మాన్ ఖాన్ హీరో కాబట్టి, మిగతా ఏ భాషలో రిలీజ్ చేసినా, ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనేది ఇప్పుడు అందరు ముందు ఉన్న పెద్ద సవాల్. బాలీవుడ్ మార్కెట్ కి దిల్ రాజు, వంశీ కొత్తే. ఈ మూవీకి కలిసి వచ్చే అంశం ఏదన్నా ఉందీ అంటే హీరోయిన్‌గా నటిస్తున్న ఒక్క నయనతార మాత్రమే. కానీ, నయన్ ని చూసి జనాలు సినిమాను హిట్ చేస్తారంటే అది కూడా జరగని పని. కేవలం కంటెంట్ ఒక్కటే ఈ సినిమాను నిలబెట్టే ప్రధాన బలమైన అంశం. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.