Mon. Mar 30th, 2026

    Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో ఇదే వార్త వైరల్ అవుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ పెద్ది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజులు విడుదలకు సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూవీకి సంబందించి రక రకాల వార్తలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

    ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్, గ్లోబల్ రేంజ్ సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో వస్తోన్న సినిమానే పెద్ది. జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా తారాస్థాయిలో అంచనాలను పెంచేసింది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు పెద్ది కథ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందట. ఇందులో, చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించనున్నట్టుగా తెలుస్తోంది. మొదటిసారి, తండ్రీకొడుకులుగా బుచ్చిబాబు చూపించబోతున్నాడట.

    peddi-movie-peddi-story-leaked-ram-charan-as-father-and-son
    peddi-movie-peddi-story-leaked-ram-charan-as-father-and-son

    Peddi Movie: పెద్ది ఫస్ట్ షాట్, చికిరి చికిరి సాంగ్‌లో ఉన్నది కొడుకు పాత్ర 

    పెద్ది ఫస్ట్ షాట్, చికిరి చికిరి సాంగ్‌లో ఉన్నది కొడుకు పాత్ర పెద్ది అని..ఇటీవల వచ్చిన గ్లింప్స్ లో చూపించిన పహిల్వాన్ పాత్ర తండ్రి అని సమాచారం. 1980 నాటి పీరియాడిక్ కథలో పహిల్వాన్ పాత్ర కనిపిస్తుందట. ఇక, ప్రస్తుతం జరిగే కథలో చరణ్ పెద్ది పాత్ర ఉండబోతుందట. కుస్తీ పోటీలో పాల్గొనే తండ్రి పాత్ర..క్రికెట్ ఆట ఆడే కొడుకు పాత్రల్లో చరణ్ పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ అని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తున్న సమాచారం. తండ్రీ-కొడుకుల మధ్య ఉండే బలమైన సెంటిమెంట్‌ను క్రీడల ద్వారా దర్శకుడు బుచ్చిబాబు చూపించబోతున్నాడట.

    అందుకు, తగ్గట్టే పెద్ది మూవీలో రెండు పాత్రలకి సంబందించిన ఆహార్యం, మేకోవర్ చాలా డిఫరెంట్‌గా తయారు చేసినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి, రామ్ చరణ్ ని ఇది వరకూ ఏ దర్శకుడు చూపించని విధంగా బుచ్చిబాబు ఒకే ఒక్క సినిమా అనుభవంతో చూపించి మ్యాజిక్ చేయబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా వచ్చిన గ్లింప్స్ లో చరణ్ పర్ఫార్మెన్స్ చూసి చిరు ఎంతగా మురిసిపోయారో నెట్టింట హల్ చల్ చేసిన వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మరి, ఇప్పటి వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి లాంటి సినిమాలు సృష్ఠించిన రికార్డులను పెద్ది ఏ మేరకు బద్ధలు కుడుతుందో చూడాలి.

     

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.