Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా ‘బరి’ అనే టైటిల్‌తో ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. విశేషం ఏమిటంటే, ఈ మూవీ గ్రాండ్ ఓపెనింగ్ కి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా సోదరి, సోదరుడు కలిసి చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంఛింగ్‌కి పవన్ కళ్యాణ్ రావడంతో మెగా అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇప్పటి వరకూ, మెగా బ్రదర్స్ కలిసి ఒకే సినిమాలో కనిపించి అభిమానులను అలరించారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి మగధీర, బ్రూస్‌లీ, ఖైదీ నంబర్ 150 సినిమాలలో నటించి మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మొదటిసారి చెల్లెలి నిర్మాణంలో అన్న నటించడం. నిహారిక నిర్మాతగా మారి యదు వంశీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని నిర్మించి హిట్ అందుకుంది. ఇప్పుడు ఇదే దర్శకుడు ‘బరి’ టైటిల్‌తో ఈ భారీ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. త్వరలో, రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది.

Varun Tej: మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ సినిమా ‘బరి’ రాబోతోంది.
మన టాలీవుడ్ హీరోలకి..మరీ ముఖ్యంగా, మెగా హీరోలకు సంక్రాంతి పండుగా బాగా కలిసొస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నారు. 2027 సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ సినిమా ‘బరి’ రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నిహారిక అధికారికంగా ప్రకటించింది. తాజాగా, శ్రీరామనవమి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి టీజర్ వచ్చి భారీ సర్‌ప్రైజ్ చేసింది. అంతకముందు వచ్చిన ఫస్ట్ షాట్ ఏ రేంజ్‌లో అంచనాలను పెంచిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు, ఆ అంచనాలను మరింతగా పెంచాడు పెద్ది టీజర్ రిలీజ్ చేసి దర్శకుడు బుచ్చిబాబు. పెద్ది పహిల్వాన్ అంటూ ఈ టీజర్ రిలీజ్ అయ్యాక మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి, ఇలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుస అప్‌డేట్స్‌తో ఇటు ఇండస్ట్రీ వర్గాల వారు అటు మెగా అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఇక, వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. చిరంజీవి హీరోగా రెండు సినిమాలు లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే, పవన్ కళ్యాణ్ హీరోగానూ ఓ సినిమా మొదలవ్వాల్సి ఉంది. మిగతా మెగా హీరోలు కూడా తమ సినిమాలతో రెడీ అవుతున్నారు.

