Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవప్రసాద్‌గారు సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్‌ను నమోదు చేస్తోంది. దీంతో, చిత్రబృందం గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను జరిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇక, ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ సహా ఇతర నటీమణులు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్‌పై చిరు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అందం లాంటిది అన్నారు. ఎవరు ఎలా ఉంటారో వారు కెరీర్ కూడా అలా సాగుతుందని, సినిమా ఇండస్ట్రీ ఓ అద్భుతమైన ప్రపంచం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు..కానీ, ఇక్కడ సక్సెస్ అవడం అనేది మనం కష్టపడటం మీదే ఆధాపడి ఉంటుంది..ఇక్కడ మన ప్రవర్తన బట్టే ఫలితం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.

Chiranjeevi: చిరు తనయ..నిర్మాత సుష్మిత గురించి మాట్లాడుతూ,
సుష్మిత గురించి కొన్ని విషయాలు:
చిరు తనయ..నిర్మాత సుష్మిత గురించి మాట్లాడుతూ, తను అనుకుంటే పెద్ద స్టార్స్‌తోనే సినిమాలు చేయొచ్చు. కానీ, ముందు అనుభవం రావాలి..ఇండస్ట్రీలో అన్నీ విభాగాల మీద పట్టు సాధించాలి. అందుకే, కొన్ని వెబ్ సిరీస్ చేసింది. అలా, ఇక్కడ ఉన్న లోటుపాట్లు తెలుసుకున్న తర్వాతే నాతో సినిమా నిర్మించింది. ఇప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇండస్ట్రీ చాలా గొప్పది..మనం కష్టపడితేనే సక్సెస్ వస్తుంది..అలా, కాకుండా మామీద నెగిటివిటీ ఉందని భావిస్తే..అది వారి తప్పే అవుతుందని చిరు మాట్లాడారు.
ఇక్కడ ఎవరైనా సరే..వారి బిహేవియర్ మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రతీ విషయంలో ఎంత నిబద్ధతతో ఉంటే అంతగా విజయం నున్ను వరిస్తుంది. ఏ ఒక్కరూ అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను ఇబ్బంది పెట్టరు..కాస్టింగ్ కౌచ్ లాంటివి కూడా ఉండవు. ఇండస్ట్రీలో ఇలాగే ఉండాలేమో అనుకుంటే అవతలి వాళ్ళకి అది అవకాశం అవుతుంది. నువ్వు ఎంత ప్రొఫషనల్‌గా ఉంటే అవతలి వాళ్ళు కూడా అంతే ప్రొఫషనల్‌గా ఉంటారు..అంటూ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై చిరు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి, మెగాస్టార్ చిరంజీవి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్ హిట్ అందుకున్నారు. నయనతార హీరోయిన్‌గా వెంకటేష్ గెస్ట్ రోల్ చేసిన మన శంకరవరప్రసాద్‌గారు అందరికీ ఓ మైల్ స్టోన్ మూవీగా మిగులుతుందనడంలో సందేహమే లేదు. దర్శకుడిగా అనిల్ రావిపూడి 9 వ హిట్ అందుకోవడం విశేషం.

