Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ గురించి తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ వైతల్ అవుతున్న వార్త ఇది. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో ముందు నుంచి ‘పెద్ది’ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు, తగ్గట్టే ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండటంతో బాలీవుడ్‌లోనూ ‘పెద్ది’ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి.
జగపతి బాబు, ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకూ పోషించనటువంటి ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ కూడా అసలు ఏ ఒక్కరూ పోల్చుకోనంత వెరైటీగా బుచ్చిబాబు డిజైన్ చేశాడు. ఇతర కీలక పాత్రల్లో దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్, బొమన్ ఇరానీ కనిపించబోతున్నారు. ఇక, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్, ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ ఏ రేంజ్‌లో సినిమాపై అంచనాలను పెంచాయో తెలిసిందే.

Peddi: ఆమిర్ ఖాన్ నటించిన ‘లగాన్’ తరహాలో ఉండబోతుందా ?
ఇప్పుడు, ఆ అంచనాలను మరింత పెంచేలా ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ‘పెద్ది’ సినిమా ఫస్ట్ షాట్ వచ్చినప్పుడు, ఇందులో చూపించిన క్రికెట్ ఆట నేపథ్యంలో కథ సాగుతుందని అందరూ అనుకున్నారు. ఒకప్పుడు ఆమిర్ ఖాన్ నటించిన ‘లగాన్’ తరహాలో ఉండబోతుందని చెప్పుకున్నారు. నిజంగా అలాంటి కథా నేపథ్యమే అయితే అవార్డులు గ్యారెంటీ అనుకోవడంలో సందేహమే లేదు. ‘రంగస్థలం’ సినిమా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి పేరు తెచ్చిందో.. అంతకి రెట్టింపు పేరు తెచ్చిపెడుతుందనడంలోనూ మరో ఆలోచనలే అక్కర్లేదు.
కానీ, ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ‘పెద్ది’ సినిమా కథ మల్టీ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఈ మూవీలో ఒక్క క్రికెట్ ఆట మాత్రమే కాకుండా మరికొన్ని జాతీయ క్రీడలు ఉండబోతున్నాయని సమాచారం. ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి ఇలా క్రీడా నేపథ్యాన్ని జోడించి సినిమా తీసి గనక మెప్పిస్తే ప్రపంచవ్యాప్తంగా అటువంటి సినిమాలకి గొప్ప ఆదరణ లభిస్తుందనే ఉదాహరణలు ‘లగాన్’, ‘చక్ దే ఇండియా’, ‘గురు’ లాంటి సినిమాలు నిరూపించాయి. ఆ సినిమాలన్నిటినీ మించి ‘పెద్ది’ ఉండబోతుందని దర్శకుడు బుచ్చిబాబు చెప్పకనే చెబుతున్నాడు. చూడాలి, మరి పెద్ది ఇండియన్ సినిమా రికార్డ్స్‌ని ఏ రేంజ్‌లో నమోదు చేస్తుందో.

