Tue. Feb 10th, 2026

    The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సినిమాల కోసం ఆయన అభిమానులే కాదు, సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన క్రేజ్‌ని దృస్టిలో పెట్టుకుని బడా నిర్మాణ సంస్థ‌లు డార్లింగ్ తో భారీ బడ్జెట్ కేటాయించి సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ప్రకటన రాలేదు గానీ, లైన్‌లో ఉన్నాయి. పీపుల్ మీడియా సంస్థ ప్రభాస్‌తో ది రాజా సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

    the-raja-saab-is-it-because-of-frabhas-that-it-is-delayed
    the-raja-saab-is-it-because-of-frabhas-that-it-is-delayed

    The Raja Saab: తాత‌ – మ‌న‌వ‌డి పాత్ర‌ల్లో ప్ర‌భాస్ 

    మారుతి ద‌ర్శ‌కత్వంలో రొమాంటిక్ కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఘోస్ట్‌గా క‌నిపించి అద‌ర‌గొట్ట‌బోతున్నాడని సమాచారం. తాత‌ – మ‌న‌వ‌డి పాత్ర‌ల్లో ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న విషయం బయటకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరిలో ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు జంటగా మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగర్వాల్‌, రిద్దికుమార్ న‌టిస్తున్నారు. కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ సీనియర్ నటులు సంజ‌య్‌ద‌త్, అనుప‌మ్ ఖేర్ క‌నిపించ‌నున్నారు. ఇక స్టార్ హీరోయిన్ నయనతార స్పెషల్ సాంగ్‌లో కనిపించడం మరో హైలెట్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రాజా సాబ్ మూవీ నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు.

    ఇప్పటికే, సినిమాకి సంబందించిన చిత్రీకరణ మొత్తం పూర్తైందట. కానీ, ప్రభాస్ మాత్రం ఇంకా డబ్బింగ్ చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విదేశాలలో ఉన్నారు. ఎప్పుడు వస్తారో క్లారిటీ లేదు. ఆయన వచ్చి గనక డబ్బింగ్ చెప్పేస్తే రాజా సాబ్ ప్రమోషన్స్ మొదలవుతాయి. ఈ నెలలోనే టీజర్ రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్ ప్రకటించారు కూడా. కానీ, ప్రభాస్ డబ్బింగ్ చెప్పకపోవడం వల్లే అది వీలవడం లేదని తెలుస్తోంది. కాగా, టీజర్..గ్లింప్స్‌తో రాజా సాబ్ మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇది కాకుండా ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 చిత్రాలు చేయాల్సి ఉంది ప్రభాస్.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.