Tue. Jan 20th, 2026

    Lavanya: లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం రోజురోజుకు సంచలనంగా మారడమే కాకుండా ఈ వివాదంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య రాజ్ తరుణ్ తనని మోసం చేశారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా తనకు మరి కొందరితో అఫైర్స్ ఉన్నాయంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు.

    ఇలా వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ వివాదం సరికొత్త పరిణామాలకు కారణమవుతుంది. రాజ్ తరుణ్ తరఫున శేఖర్ భాష అనే వ్యక్తి మీడియా లైవ్ డిబేట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లావణ్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా డ్రగ్స్ ఇస్తుందంటూ ఆయన వెల్లడించారు.

    ఇలా తన గురించి శేఖర్ భాష మాట్లాడటంతో లావణ్య తనపై చెప్పుతో కూడా దాడి చేసింది. ఇలా డ్రగ్స్ తీసుకోవడం రాజ్ తరుణ్ కు నచ్చకపోవడంతోనే తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని శేఖర్ భాషా వెల్లడించారు. ఇలా అందరికీ డ్రగ్స్ అలవాటు చేసి అమాయకుల జీవితాలతో లావణ్య ఆడుకుంటుందని తెలిపారు.

    డ్రగ్స్ తీసుకుంటుంది..
    ఇక లావణ్య కొంతమందిని డ్రగ్స్ విషయంలో ఇబ్బంది పెడుతూ డబ్బు గుంజే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఈ విధంగా లావణ్య గురించి శేఖర్ భాష డ్రగ్స్ ఆరోపణలు చేయడమే కాకుండా ఓ యువతి యువకుడు లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసింది అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా వీరి వివాదం కారణంగా సరికొత్త విషయాలని వెలుగులోకి వస్తున్నాయి.