Camphor: జీవితమన్న తర్వాత ప్రతి ఒక్కరికి కష్టాలు ఉండటం సర్వసాధారణం అయితే ఆ కష్టాల నుంచి కొంత సమయానికి ఉపశమనం పొందుతూ ఉంటారు. అయితే కొంతమందిని మాత్రం ఒకటి పోతే మరొక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. తద్వారా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా మానసిక ప్రశాంతతను కోల్పోవడం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఇలా సమస్యలు కనుక వెంటాడుతూ ఉన్నట్లయితే కేవలం కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలు ఇబ్బందులు వెంటాడుతున్నటువంటి వారు శుక్రవారము ఉదయమే తలంతూ స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని శ్రీదేవి ఫోటోకి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత ఎర్రటి వస్త్రంలో ఐదు కర్పూరం బిళ్ళలు తీసుకొని వాటికి పసుపు కుంకుమ పెట్టి చిన్నది మూటలాగా కట్టాలి ఇలా మూట కట్టిన కర్పూర బిల్లలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు ఉంచి ధూప దీపాలతో పూజ చేయాలి అనంతరం మనం పడుతున్నటువంటి ఇబ్బందులను అమ్మవారికి తెలియజేయాలి.
ఇలా పూజ చేసి కొత్త సమయం పాటు దేవుడి ముందే ఆ కర్పూరపు మూటను పెట్టాలి అనంతరం దానిని తీసుకువెళ్లి మనం డబ్బు దాచే చోట పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక వ్యాపారాలలో నష్టాలు వస్తున్నటువంటి వారు వ్యాపారం చేసే చోట ఈ కర్పూరపు మూటను తీసుకువెళ్లి పెట్టడం వల్ల వ్యాపారం కూడా ఎంతో మంచి అభివృద్ధి చెందుతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల లక్ష్మీ దేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.
Must Read: https://natelugu.com/sai-pallavi-green-signal-for-ram-charan-and-naga-chaitanya-movies/