Wed. Feb 11th, 2026

    Bigg Boss 3 Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ మల్లారెడ్డి ని మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారని తాజా సమాచారం. దీపావళి పండుగ సందర్భంగా హిమజ హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మొత్తం 12మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నటి, యాంకర్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ హిమజ కూడా ఉన్నట్టు సమాచారం. మిగిలిన 11మంది కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారే అని ప్రచారం సాగుతోంది.

    మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళలో హిమజతో పాటూ ఇంకొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక హిమజ గతంలో టీవీ సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తో సినిమాల్లో మంచి రోల్స్ అందుకుంది. ఇదే ఆమెను బాస్ హౌస్ లో అవకాశం వచ్చేలా చేసింది.

    bigg-boss-3- Rave party in the outskirts of the city.. 12 celebrities caught..?
    bigg-boss-3- Rave party in the outskirts of the city.. 12 celebrities caught..?

    Bigg Boss 3 Himaja: ఇలాంటి వ్యవహారాలలో ఎప్పుడు తన పేరు వినిపించలేదు. 

    హిమజ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత సినిమాలలో ఛాన్సులు బాగా దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే టీవీలో యాంకర్ గానూ అలరిస్తోంది. హిమజది తెనాలి. సినిమాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేసింది. మోడలింగ్ నుంచి టీవీ సీరియల్స్, సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. చెప్పాలంటే హిమజ మంచి రెమ్యునరేషన్ అందుకుంటోంది. బాగా హెడ్ వైట్ అని చెప్పుకుంటుంటారు. కానీ, ఇలాంటి వ్యవహారాలలో ఎప్పుడు తన పేరు వినిపించలేదు. ఇదే మొదటిసారి. మరి ఇది ఎంతవరకూ నిజమో..దీనిపై హిమజ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.