YSRCP PARTY: జగన్‌కు బిగ్ షాక్.. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ!

YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి. ఒకప్పుడు పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ ఉనికి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో పరాజయం పాలైన కీలక నేతలు కొందరు రూట్ మార్చి వేరే పార్టీల కండువాలు కప్పేసుకోవడం, మరికొందరు పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అధిష్టానం ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో, అక్కడ వైఎస్సార్‌సీపీ దాదాపు ఖాళీ అయ్యే సీన్ కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోని కొన్ని కీలక స్థానాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నికల ముగిసిన వెంటనే జగ్గయ్యపేట వంటి చోట్ల బలమైన నేతలు జనసేన గూటికి చేరడంతో అక్కడ వైఎస్సార్‌సీపీని నడిపించే నాథుడే కరువయ్యాడు. ఇక రాజోలు లాంటి నియోజకవర్గాల్లో ఓటమి తర్వాత ఇన్‌ఛార్జ్‌లు లైట్ తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ పూర్తిగా మూగబోయింది. లీడర్ల భవిష్యత్తు ఎలా ఉన్నా, నమ్ముకున్న క్యాడర్‌ను ఇలా నడిరోడ్డుపై వదిలేయడంపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ysrcp-party-big-shock-for-jagan-ycp-left-empty-handed-in-those-constituencies

YSRCP PARTY: వైసీపీ అనే మాటే వినిపించకుండా పోవడంతో, తక్షణమే అధిష్టానం జోక్యం చేసుకోకపోతే

మరోవైపు, పార్టీలోనే ఉంటూ సైలెంట్‌గా ఉంటున్న సీనియర్ల తీరు జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్తిపాడు, విజయవాడ సెంట్రల్ వంటి నియోజకవర్గాల్లో గతంలో చక్రం తిప్పిన మాజీ మంత్రులు, సీనియర్ మహిళా నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. కొందరు సొంత నియోజకవర్గాలను వదిలి పక్క రూట్ చూసుకుంటుంటే, మరికొందరు పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా కనీసం ఖండించకుండా మౌన వ్రతం వహిస్తున్నారు. ఈ నలుగురు కీలక నేతల సైలెన్స్ వెనుక అసలు రహస్యం ఏంటా అని క్యాడర్ బుర్రలు బద్దలు కొట్టుకుంటోంది.

ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అనే మాటే వినిపించకుండా పోవడంతో, తక్షణమే అధిష్టానం జోక్యం చేసుకోకపోతే మున్ముందు కోలుకోవడం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. లీడర్లు లేక, ఉన్నవాళ్లు యాక్టివ్‌గా లేక వెనుకబడిపోతున్న ఈ స్థానాలను జగన్ ఎలా సెట్ చేస్తారు? కొత్త ఇన్ఛార్జ్‌లను నియమించి పార్టీకి పూర్వవైభవం తెస్తారా లేక ఇలాగే వదిలేస్తారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.