Categories: Health

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు ఎక్కుతున్నప్పటికీ చాలా అలసిపోయిన భావన, ఆయాసం రావడం వంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా మెట్లు ఎక్కుతున్న సమయంలో ఆయాసం వచ్చినట్లయితే మనం బహుశా ఫిట్ గా లేమని ఫిట్నెస్ లోపం కారణంగానే మెట్లు ఎక్కుతున్న సమయంలో ఆయాసం వస్తుందని భావిస్తుంటాము. మరి నిజంగానే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తే ఫిట్నెస్ కోల్పోయినట్టేనా? అనే విషయానికి వస్తే…

మెట్లు ఎక్కుతున్నప్పుడు కొంతమేరకు ఆయాసం రావడం సాధారణమే. ముఖ్యంగా శారీరక శ్రమకు అలవాటు లేకపోవడం, ఎక్కువ బరువు ఉండటం లేదా ఎక్కువ వేగంగా మెట్లు ఎక్కడం వల్ల ఊపిరి వేగంగా తీసుకోవాల్సి రావచ్చు. అయితే ప్రతిసారీ మెట్లు ఎక్కినప్పుడు ఎక్కువగా ఆయాసం రావడం లేదా గతంలో కంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరగడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మెట్లు ఎక్కేటప్పుడు మనకు తరచు ఆయాసం వస్తుంది అంటే మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పూర్తిగా తగ్గిపోతుందని అర్థం. కొన్నిసార్లు గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల వల్ల కూడా శ్రమ చేసినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఆయాసం తరచుగా వస్తుంటే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Getting tired or breathless while climbing stairs know the reason

Climbing Stairs: గుండె సంబంధిత సమస్యలు కావచ్చు…

ముఖ్యంగా ఆయాసంతో పాటు ఛాతీలో నొప్పి లేదా బిగుతు, తల తిరగడం, అధిక చెమటలు, గుండె వేగంగా కొట్టుకోవడం, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇవి కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గుండె లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు.అయితే ఒక్క ఆయాసం ఆధారంగా గుండె జబ్బు ఉందని నిర్ధారించలేం. మీ వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి, ఇతర లక్షణాలను బట్టి అసలు కారణాన్ని వైద్యుడు అంచనా వేస్తారు. కాబట్టి తరచూ మెట్లు ఎక్కేటప్పుడు అసాధారణంగా ఆయాసం వస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి సరైన కారణాలు తెలుసుకొని చికిత్స తీసుకోవడం ఎంతో మంచిది.

Sravani

Recent Posts

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

9 hours ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

This website uses cookies.