AP POLITICS: పవన్‌కు బీజేపీ దోస్తీనే శాపంగా మారుతోందా?

AP POLITICS: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుగులేని రాజకీయ శక్తిగా వెలుగుతున్నారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, వైఫల్యం లేని విజయంతో పీఠం ఎక్కిన పవన్ ప్రయాణం పైకి అంతా సాఫీగా కనిపిస్తున్నా.. తెర వెనుక మాత్రం సరికొత్త రాజకీయ సమీకరణాలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ తో ఆయనకు ఉన్న బలమైన అనుబంధం, ఇప్పుడు జనసేనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది. కూటమి విజయంతో పెరగాల్సిన మిత్రుల సంఖ్య కంటే, ఈ దోస్తీ వల్ల పెరుగుతున్న శత్రువుల సంఖ్యే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

సినిమా రంగంలో పవన్‌కు ఆప్తుడిగా ఉంటూనే, రాజకీయంగా నిత్యం విమర్శలు గుప్పించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వైఖరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన పవన్‌ను టార్గెట్ చేయడం వెనుక వ్యక్తిగత వైరం కంటే.. బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సనాతన ధర్మం, జాతీయవాదం, హిందీ భాషా మద్దతు వంటి అంశాలపై పవన్ మాట్లాడుతున్న ప్రతిసారీ.. ఆయన వెనుక బీజేపీ స్క్రిప్ట్ ఉందనే ముద్ర వేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు.. కేంద్రంలోని బీజేపీని నేరుగా ఢీకొట్టలేని శక్తులన్నీ, ఇప్పుడు ఆ పార్టీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న పవన్‌ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా దాడికి దిగుతున్నాయి.

ap-politics-is-the-alliance-with-the-bjp-turning-into-a-curse-for-pawan

AP POLITICS: పవన్ కళ్యాణ్‌కు ఉన్న అశేష ప్రజాదరణ

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీజేపీ వ్యూహాత్మక మౌనం వహించడం గమనార్హం. పవన్ కళ్యాణ్‌కు ఉన్న అశేష ప్రజాదరణను, స్టార్ ఇమేజ్‌ను తమ ఎన్నికల ప్రచారాలకు, పార్టీ మైలేజ్‌కు బీజేపీ అద్భుతంగా వాడుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి తమిళనాడు రాజకీయ పరిణామాల వరకు.. పవన్ క్రేజ్ బీజేపీకి లాభం చేకూర్చిన మాట వాస్తవం. కానీ, అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీ వ్యతిరేక శక్తులు పవన్‌ను శత్రువుగా చూడటం ప్రారంభించాయి. ఒక రకంగా బీజేపీతో స్నేహం వల్ల జనసేనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నప్పటికీ, ప్రాంతీయంగా లేనిపోని రాజకీయ శత్రుత్వాన్ని, వ్యక్తిత్వ హననాన్ని పవన్ మోయాల్సి వస్తోంది.

కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న కూడా.. ఈ జాతీయ స్థాయి రాజకీయ చట్రం పవన్ చుట్టూ ఒక పద్మవ్యూహాన్ని సృష్టిస్తోంది. మిత్రపక్షంగా ఉంటూ లాభపడటం కంటే.. ఆ స్నేహం తెచ్చిపెడుతున్న వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికే పవన్ ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి వస్తోంది. మరి ఈ రాజకీయ దోస్తీ జనసేన భవిష్యత్తుకు నిజంగానే రక్షణ కవచంగా మారుతుందా, లేక కొత్త శత్రువులను తయారు చేసే శాపంగా పరిణమిస్తుందా అనేది రాబోయే రోజుల్లో పవన్ తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.