Andhra Pradesh: పవన్‌పై ప్రశ్నల వర్షం.. డిప్యూటీ సీఎంను బుక్ చేసిన కమెడియన్!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ నుంచి ఊహించని రీతిలో ఒక పొలిటికల్ గూగ్లీ ఎదురైంది. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ.. తాజాగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేవలం విమర్శలు చేయడమే కాకుండా, చట్టపరమైన నిబంధనలను ప్రస్తావిస్తూ ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు డిప్యూటీ సీఎంను ఇరకాటంలో పడేశాయనే చర్చ నడుస్తోంది.

రాహుల్ రామకృష్ణ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల పనితీరును నేరుగా ప్రశ్నించారు. “పవన్ కళ్యాణ్ గారు.. మీ ఆర్భాటాలను కాస్త పక్కన పెడితే, సమాచార హక్కు చట్టం (RTI) కింద మీ శాఖల్లోని వివరాలను బహిర్గతం చేస్తున్నారా? సెక్షన్ 4.1(బి) ప్రకారం ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారా?” అంటూ ఒక సామాన్య పౌరుడిగా, అభిమానిగా తనకు సమాధానం కావాలని గట్టిగా డిమాండ్ చేశారు.

a-barrage-of-questions-for-pawan-comedian-puts-the-deputy-cm-on-the-spot

Andhra Pradesh: ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలు తీరుపై

ఇంతటితో ఆగకుండా ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలు తీరుపై కూడా రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పెసా (PESA) చట్టం, 1/70 చట్టం, గ్రామసభల నిర్వహణకు సంబంధించిన క్షేత్రస్థాయి ఫలితాలను చూపించాలని నిలదీశారు. అటవీకరణ కార్యక్రమాలపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, ఒక స్వతంత్ర సంస్థ ఇచ్చిన నివేదికలకు అస్సలు పొంతన లేదని.. అవన్నీ తీవ్ర అనుమానాస్పదంగా ఉన్నాయని రాహుల్ పేర్కొనడం గమనార్హం. తాను స్వయంగా సేకరించిన వివరాల ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఈ ట్వీట్ ముగింపులో రాహుల్ రామకృష్ణ ‘జై తెలంగాణ’ అని నినదించడం ఇప్పుడు మరింత వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణ సమాజంలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. రాహుల్ ఈ స్లోగన్ వాడటం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వచ్చే ట్రోలింగ్‌ను ముందే ఊహించిన రాహుల్.. “ప్రశ్నించినంత మాత్రాన నన్ను దేశద్రోహిగా ముద్ర వేయకండి” అంటూ ముందే కౌంటర్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.