Beauty Tips: వేసవికాలంలో బయటకు వెళ్తే ఒక్క సారిగా చర్మం మొత్తం నల్లబడిపోతుంది. ఇలా చర్మం మొత్తం ట్యాన్ కావడంతో అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. అయితే చర్మం పై ఏర్పడిన ఈ ట్యాన్ తొలగించుకోవడానికి ఖరీదైన రసాయనాలతో కూడిన క్రీమ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా అరటిపండు బంగాళా దుంపతో ట్యాన్ మొత్తం తొలగించుకొని నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా చేసుకోవచ్చు. మరి బంగాళాదుంప అరటిపండుతో ఏ విధంగా మన చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవచ్చు అనే విషయానికి వస్తే..
చర్మం పై ఏర్పడిన ట్యాన్ తొలగించుకోవడం కోసం ఒక బంగాళాదుంపను పొట్టుతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనితో పాటు సగం పండిన అరటి పండును తీసుకొని ఈ మిశ్రమంలోకి పాలు కలిపి మెత్తగా తయారు చేసుకోవాలి. ఈ విశ్రమాన్ని మొహం, మెడ అలాగే మోచేతి, మోకాళ్ళ వంటి నల్లగా ఉన్న చర్మ భాగాల పై మాస్క్ లాగా వేసుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఈ మాస్క్ అలాగే ఉంచుకోవాలి.
ఇలా 20 నిమిషాల తర్వాత ఈ మాస్క్ ను చల్లని నీటితో మసాజ్ చేస్తూ శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయటం వల్ల చర్మం పై ఏర్పడిన ట్యాన్ మొత్తం తొలగిపోయి నల్లగా మారిన మీ మొహం తెల్లగా మారిపోతుంది. బంగాళదుంప లో ఉండే సహజ పదార్థాలు మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి దోహదపడుతుంది. అదేవిధంగా అరటి పండు మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇక పాలలో ఉండే సహజ పదార్థాలు చర్మాన్ని మృదువుగా మార్చడానికి దోహదపడతాయి. ఇలా ఈ మిశ్రమాన్ని మొహానికి మాస్క్ లాగా వేసుకోవటం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారడమే కాకుండా ట్యాన్ మొత్తం తొలగిపోయి తెల్లగా మారుతుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.