YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి వ్యవహారంలో నేడు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించి చంచల్ గూడా జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందించారు.
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానని బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కానీ, ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినప్పటికీ అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను..అని జగన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
YS Jagan Mohan Reddy: శనివారం, ఆదివారం కోర్టులకి సెలవులు ఉంటాయి
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ కేసును చేపట్టిన ప్రముఖ న్యాయమూర్తులు అల్లు అర్జున్ ని బయటకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా, ఇప్పుడు అంతటా ఇదే హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ కి ఎంత లేదన్నా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈరోజు శుక్రవారం కావడంతో శనివారం, ఆదివారం కోర్టులకి సెలవులు ఉంటాయి కాబట్టే అరెస్ట్ కి ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024