Health care: ప్రస్తుత కాలంలో మారిపోయిన ఆహారపు అలవాట్లు కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇలా చిన్న వయసులోనే ప్రతి ఒక్కరూ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా ఎక్కువ మంది బాధపడే వారిలో కిడ్నీ బాధితులు కూడా ఉన్నారని చెప్పాలి. అయితే ఈ కిడ్నీ సమస్యలు తీవ్రతరం కాకుండా ముందుగానే వాటిని గుర్తించు సరైన చికిత్స తీసుకోవడం ఎంతో మంచిది.
ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని సంకేతం ఈ లక్షణాలు మీలో కనబడితే వెంటనే డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే మీ మూత్రం రంగు మారుతుందో అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మూత్రవిసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం కాళ్లు పాదాలు ఎక్కువగా చీలికలు రావటం మంటలు ఉండటం. వికారం వాంతి కలిగే అనుభూతి ఉండటం ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి.
చిన్న పనికి అలసిపోవడం వెన్నులో నొప్పి లేదా కడుపునొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లయితే ఇవి కిడ్నీ సమస్యలకు కారణం అవుతాయని ఈ లక్షణాలు కనుక కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఇక వేసవి కాలంలో తొందరగా మన శరీరం డీ హైడ్రేషన్ అవుతుంది. అలా డీ హైడ్రేషన్ కాకుండా తరచూ నీళ్లు లేదా పండ్ల రసాలు తీసుకుంటూ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ఎంతో మంచిది.