Categories: HealthLatestNews

Drinking water: అన్నం తింటూ నీళ్లు తాగుతున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే?

Drinking water: నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 7 నుంచి 8 లీటర్ల వరకు నీటిని తాగటం వల్ల మన శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఇలా నీరు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ చాలా మంది బోజనం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా ప్రతి ముద్ద ముద్దుకు నీళ్ళు తాగే అలవాటు ఉంటే మీరు అనారోగ్యానికి గురి అయినట్టే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం వల్ల కలిగే అనర్థాలు ఏంటీ అనే విషయానికి వస్తే..

మనం భోజనం చేసే సమయంలో మన జీర్ణ వ్యవస్థలో మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కొన్ని యాసిడ్లు విడుదల అవుతాయి. ఈ యాసిడ్ల కారణంగా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. ఇలాంటి సమయంలో మనం నీటిని తాగటం వల్ల ఈ యాసిడ్ల గాఢత తగ్గిపోయి ఆహారం సరిగ్గా అరగదు. ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది వరకే జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా భోజన సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటే కచ్చితంగా ఈ అలవాటును మానుకోవాలని చెబుతున్నారు.

Why you should never drinking water while eating food know the side effects

Drinking water: ఛాతీతో మంట కలిగిస్తుంది..

భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. నీరు ఎక్కువగా తీసుకోవడం జీర్ణరసాల కదలికలు పూర్తిగా మందగించి మనం తీసుకున్న ఆహారం అన్నవాహికలోకి వస్తుంది. తద్వారా గొంతులో మంటగా అనిపించడం వంటి అసౌకర్యాలు ఉంటాయి. ఇలా మాటిమాటికి నీరు తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం అనిపించి భోజనం తర్వాత ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపడకుండా బద్దకంగా ఉంటారు. అవసరానికి మించి భోజనంతో పాటు నీరు తాగితే కడుపు నీటితోనే త్వరగా నిండిపోతుంది. తద్వారా అప్పటికి కడుపు నిండిన భావన కలిగిన తర్వాత మరి ఆకలి కలుగుతుంది. ఇది శరీర బరువు పెరగడానికి దోహద పడుతుంది. అందుకే భోజన సమయంలో ఎక్కువగా నీళ్ళు తాగకుండా భోజనం తరువాత కొద్దిసేపటికి నీళ్లు తాగడం మంచిది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.