Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి అధికారులు కీలక సూచనలను జారీ చేశారు. మరి కొద్ది రోజులలో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లను ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొన్ని కీలక మార్పులను చేపట్టింది. ఇలా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి పుష్కరిని ప్రవేశాలను నిలిపివేస్తూ టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం గురించి భక్తులకు అధికారకంగా వెల్లడించారు. త్వరలోనే సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణలో కొన్ని పనులు ప్రారంభించిన నేపథ్యంలో పుష్కరిని ప్రవేశాలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పుష్కరినిలో పలు మరమ్మత్తుల నేపథ్యంలోనే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు భక్తులకు పుష్కరిణికి అనుమతులు లేవని వెల్లడించింది. ఇలా సుమారు 40 రోజులపాటు పుష్కరిణి మూసివేసి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ 40 రోజుల సుదీర్ఘ వ్యవధిలో భక్తులను పుష్కరిణిలో స్నానాలకు అనుమతించరు. ప్రతిరోజు సాయంత్రం వేళ అత్యంత పవిత్రంగా నిర్వహించే ‘పుష్కరిణి హారతి’ కూడా ఉండదని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికలను చేసుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే ముందస్తు సమాచారాన్ని తెలియజేశారు.పుష్కరిణిలో అవసరమైన ప్రధాన మరమ్మతు పనులు, శుభ్రపరిచే కార్యక్రమాలను చేపట్టనున్నారు. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి మరమ్మత్తులో అనంతరం పవిత్ర జలంతో నింపే ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు. ఈ పనులు ఆగస్టు 31వ తేదీ వరకు జరగనున్నాయి అయితే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 మధ్య కాలంలో భారీ వర్షాలు, తుఫాన్‌లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 10 వరకు పుష్కరిని మూసివేస్తున్నట్లు తెలిపారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.