Categories: DevotionalLatestNews

Tholi Ekadashi 2026: తొలి ఏకాదశి.. విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే జన్మజన్మల పాపాలు పోయినట్టే?

Tholi Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశికి మరింత విశిష్టత ఉంది అని చెప్పాలి. ఈ ఏడాది ఆషాడమాసం జులై 25 వ తేదీ తొలి ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.దక్షిణాయానం ప్రారంభమైన తర్వాత వచ్చే ఏకాదశి కాబట్టి ఈ పండగను తొలి ఏకాదశి అని పేర్కొంటారు. ఏకాదశి తిథి శుక్రవారం ఉదయం 10.08 గంటలకు ప్రారంభమై 25 జూలై శనివారం ఉదయం 11.54 గంటలకు పూర్తి అవుతుంది. సూర్యోదయం వేళ.. ఏ తిథి ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటారు. దాంతో తొలి ఏకాదశి శనివారంగా పరిగణిస్తారు.

విష్ణు దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ విష్ణు దేవుడిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణువుకు ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించి సర్వపాపాలు తొలగిపోతాయి. ఇక విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి దళాలను ఉపయోగించడం వల్ల విష్ణు దేవుడి అనుగ్రహం కలుగుతుంది. పూజలో విష్ణు సహస్ర పారాయణం చదవాలి అలాగే స్వామివారికి వడపప్పు, పానకం, పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించడం మంచిది. అదేవిధంగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తుంది అయితే ఉపవాసం ఉన్నవారు బియ్యంతో చేసిన ఎలాంటి పదార్థాలను తినకూడదు అల్లం వెల్లుల్లి లాంటి సాత్విక ఆహారానికి కూడా దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం కూడా పాటించాలి.

Tholi Ekadashi 2026 Pooja timing significance and Rituals for devotees

Tholi Ekadashi 2026: ఏకాదశి రోజు దానధర్మాలు చేయాలి..

తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయడానికి వీలు కాని వారు పూజ చేయటానికి కూడా వీలు కాని వారు దాన ధర్మాలను చేయటం వల్ల పూజ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయాలి. పురాణాల ప్రకారం ఏకాదశి రోజున దేవశయని ఈ విధమైనటువంటి దానధర్మాలు చేయడ వల్ల గొప్ప పుణ్యఫలంతో గత జన్మల్లో పూర్వీకులు చేసిన పాపాలకు విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఏకాదశి రోజు దానాలు చేయడం మంచిది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.