Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ కూడా తగ్గుతుందని భావించినప్పటికీ గత రెండు వారాలుగా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం సుమారు 18 నుంచి 24 గంటలపాటు భక్తులు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే SSD టోకెన్ రద్దు చేసింది.
గురువారం దర్శనానికి తిరుపతిలోని మూడు కేంద్రాల (శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్) దగ్గర బుధవారం జారీచేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు.తిరుమల శ్రీవారి భక్తులకు మళ్లీ శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. SSD టోకెన్లు రద్దు చేయడం ఇది వరుసగా నాలుగో వారం కావడం గమనార్హం. తిరుమల కొండపై భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు. బుధవారం దర్శనానికి సంబంధించి మంగళవారం వేకువ జామున ఐదు గంటలకే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేశారు.
ప్రస్తుతం తిరుమలలో ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు జులై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు.జులై 24 – కవచాధివాసం,జులై 25 – కవచ ప్రతిష్ఠ, జులై 26 – కవచ సమర్పణ ఉంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ విషయానికి వస్తే దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది కంపార్ట్‌మెంట్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. ఇలా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో స్వామి వారి దర్శన సమయాలలో పలు మార్పులు చేస్తున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.