Categories: Tips

Spirtual: మొక్కులు ఎందుకు చెల్లించుకోవాలి… చెల్లించకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా?

Spirtual: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మతాలు వేరైనా, ఆయా మతాలలో పూజించే దేవుళ్ళు వేరైనా మనిషిని నడిపించేది మాత్రం దేవుడు అనే నమ్మకమే.  ఆ నమ్మకం మీదనే మానవ మనుగడ సాగుతుంది. ఈ నమ్మకంతోనే ఏదైనా పని చేసేముందు ఎక్కడికైనా వెళ్ళే ముందు భగవంతుడ్ని వేడుకోవడం అందరికి ఒక అలవాటుగా ఉంది. మనల్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడేస్తాడు అనే నమ్మకంతో ఆ దేవుడ్ని ఆరాధించడం, శరణు వేడుకోవడం, ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇస్తామని మొక్కుకోవడం ప్రజలు చేస్తున్నారు. కొందరు భగవంతుడి మీద భారం వేసి తాము చేయాలనుకున్న పని చేసుకొని వెళ్తారు.

ఫలితం వచ్చాక అది దైవానుగ్రహంతోనే వచ్చింది అనే నమ్మకంతో మొక్కిన మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల వెంకన్నకి కోట్లాది రూపాయిల ఆదాయం వస్తుందన్న, ఇంకా ఏ దేవాలయంలో అయిన దేవుడిని దక్షిణలు వస్తున్నాయన్న చాలా వరకు ఈ మొక్కుల కారణంగానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన పూర్వకాలం నుంచి మన సమాజంలో ఒక ఆచారం వస్తుంది. ఒకరి నుంచి మనం ఏదైన ఆశిస్తే, అది వారు ఇచ్చినపుడు ప్రతిఫలంగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఇలా ఇచ్చుపుచ్చుకోవడం అనే వ్యవహారం సనాతనంగా మన నాగరికతలోనే ఉంది మనిషికి మనిషి ఇలా ఇచ్చుపుచ్చుకుంటున్నప్పుడు.

మనందరి పుట్టుకకి కారణం అయ్యి ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఈ దేవాది దేవుడు మనకి ఒకటి ఇస్తున్నప్పుడు ప్రతిఫలంగా మనకి తోచింది ఇవ్వడంలో తప్పేంటి అనేది చాలా మంది చెప్పే మాట. ఆ నమ్మకం, విశ్వాసం నుంచి భగవంతుడికి దండం పెట్టి ఒక ప్రతిఫలం ఆశించి అది జరిగితే నీకు నేను ఫలానా ఇది ఇస్తా అని మొక్కుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఇది హిందువులలో మరీ ఎక్కువగా ఉంటుంది. గ్రామ దేవతల నుంచి ముక్కోటి దేవతలలో చాలా మందికి ఆలయాలు ఉన్నాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అనే పేర్లు కూడా కొంత మంది దేవతలకి ఉన్నాయి. ఆ పేర్లు వెనుక ప్రజల అంతులేని విశ్వాసం దాగి ఉంటుంది. దాంతో అలా గుర్తింపు పొందిన దేవాలయాలకి వెళ్లి మొక్కుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే మొక్కుకున్న తర్వాత ఫలితం వచ్చాక ఆ మొక్కులు చెల్లించుకోకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు, అరిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు.

దీంతో మొక్కులు చెల్లించకపోతే ఏదో జరుగుతుందనే భయంతో అందరూ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అయితే ఈ భయం అనేది అంతర్లీనంగా మనుషుల మనసులలోకి సనాతన కాలం నుంచి వెళ్ళిపోవడంతో అది ఒక నెగిటివ్ వైబ్ గా మారి మనల్ని వెంటాడుతుంది. అంతర్లీనంగా మనలో గూడు కట్టుకున్న మన భయం మనల్ని మరింత  ఆందోళనని కలిగిస్తుంది. ఈ నెగిటివ్ వైబ్ వలన కచ్చితంగా ఏదో ఒక ప్రమాదాలు నిజంగానే సంభవించడం జరుగుతాయి. అవి జరిగినపుడు మొక్కులు చెల్లించకపోవడం వలనే అనే భయాన్ని ఎవరో ఒకరు ప్రస్తావిస్తూ దానిని గుర్తు చేస్తారు. ఇలా మనుషులలో పూర్వకాలం నుంచి మనకి తెలియకుండానే భయాన్ని పెంచి పోషించడం వలన మొక్కులు చెల్లించకపోతే పాపం అనే భీతి కలుగుతుంది. ఈ కారణంగానే చాలా మంది భగవంతుడికి మొక్కుకున్న తర్వాత దానిని వీలైనంత వేగంగా తీర్చేసే ప్రయత్నం చేస్తారు.

 

 

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.