Good news for tirumala devotees no more waiting at prasadan counters know details
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొండపై భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఎప్పటికప్పుడు వినూత్న నిర్ణయాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇకపోతే స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ప్రసాదం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురుచూడాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. తాజాగా టీటీడీ అధికారులు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని తెలియజేశారు.
ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడాల్సిన పనిలేదు క్షణాలలోనే భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి, భక్తులకు శీఘ్రంగా ప్రసాదాన్ని అందజేసేందుకు ‘మూవింగ్-టేబుల్’ (కన్వేయర్ బెల్ట్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వెసులుబాటు కలిగింది.
ఏడు మీటర్ల పొడవున్న టేబుల్ కన్వేయర్ బెల్ట్ మాదిరిగా నిరంతరం కదులుతుంటుంది. సిబ్బంది ప్రసాదం ప్లేట్లను దీనిపై ఉంచగానే, క్యూలైన్‌లో వెళ్లే భక్తులు ఏమాత్రం ఆగాల్సిన పనిలేకుండా నడుస్తూనే సులభంగా ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. గత నెలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం అద్భుతమైన ఆదరణను పొందడంతో ప్రస్తుతం ప్రసాదం కౌంటర్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2, నారాయణగిరి షెడ్లతో పాటు ప్రధాన క్యూలైన్లలోకి కూడా ఈ మూవింగ్-టేబుల్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు టీటీడీ వినూత్న చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తిరుమల వెళుతున్న భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోందని చెప్పాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.