Categories: Health

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో, డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేసవిలో లేదా వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో కోల్పోయిన ద్రవాలు తిరిగి భర్తీ అవుతాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు కానీ కొన్ని రకాల జబ్బులతో బాధపడేవారు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలని కూడా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి కొబ్బరి నీళ్లకు ఎవరు దూరంగా ఉండాలి అనే విషయానికి వస్తే

ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉండే అధిక పొటాషియం కారణంగా కిడ్నీల పనితీరు పై తీవ్రమైన ప్రభావం చూపడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే తక్కువ రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగితే బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది.ఇక మధుమేహం ఉన్నవారు కూడా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. ఇక వర్షా కాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారు కూడా కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండటం మంచిది.

coconut water side effects who should not drink coconut water know details

Coconut Water: దీర్ఘకాలిక సమస్యలకు మందులు వాడేవారు..

పలు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు కూడా కొబ్బరి నీళ్లు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ అందరి విషయంలోనూ ఒకే విధంగా వీటి పనితీరు ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఏ విధమైనటువంటి జబ్బులు లేకుండా ఉన్నవారు  ఎలాంటి సందేహాలు లేకుండా కొబ్బరి నీళ్లను తాగవచ్చు. కొబ్బరినీళ్లు శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.