Categories: Devotional

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే అమావాస్య పౌర్ణమి తిథికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఆషాడమాసం పూర్తి కాబోతున్న నేపథ్యంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఈ అమావాస్య ఆగస్టు 12వ తేదీ రాబోతోంది. మరి ఈ అమావాస్య రోజు ఎందుకు అంత ప్రత్యేకం?అమావాస్య రోజు ఇంట్లో చేయాల్సిన పనులు ఏంటి? పితృ దోషాలు తొలగిపోవడం కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అనే విషయానికి వస్తే…

పంచాంగం ప్రకారం, అమావాస్య తిథి ఆగస్టు 12వ తేదీ రాత్రి 01:52 నిమిషాలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 11:06 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి మహత్యాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆగస్టు 12వ తేదీ రోజంతా అమావాస్య వ్రతం, పితృ పూజలు, దేవతారాధనలు నిర్వహించుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఎంతో ప్రత్యేకమైన ఈ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకోవడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని పండితుల చెబుతున్నారు.ఉదయమే సూర్యోదయానికి ముందే మేల్కొని తలస్నానం ఆచరించి, శుభ్రమైన దుస్తులను ధరించి, ఇంటి ఆవరణలో లేదా పవిత్ర ప్రదేశంలో దక్షిణ దిశ వైపు ముఖం చేసి కూర్చోవాలి. ఒక పాత్రలోని నీటిలో నల్ల నువ్వులు, గరిక, సుగంధ పుష్పాలు వేసుకోవాలి. మన పూర్వీకుల గోత్ర నామాలను స్మరిస్తూ, భక్తితో నీటిని తర్పణంగా వదలాలి.

Ashada Amavasya 2026 ancestors blessings pitru Pooja know more details

Ashada Amavasya 2026: పితృదేవతలకు తర్పణాలు వదలాలి..

ఇలా పితృదేవతలకు తర్పణలు పెట్టేటప్పుడు మంత్రాలు తెలియని వారు దక్షిణ దిశగా నిలబడి మనస్ఫూర్తిగా “ఓం పితృదేవతాభ్యో నమః” అని స్మరిస్తూ దోసిలితో నీటిని అర్ఘ్యంగా సమర్పించినా పితృదేవతలు సంతోషించి పితృ దోషాల నుంచి విముక్తిని కల్పిస్తారు. ఇలా పితృ దోషాలు తొలగిపోవడం వల్ల కుటుంబంలో ఆర్థికాభివృద్ధి సంతానాబివృద్ధి కలుగుతుంది.పేదలకు అన్నదానం, బ్రాహ్మణులకు లేదా నిరుపేదలకు పండ్లు, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుంది. ఇక అమావాస్య రోజు సాయంత్రం రావి చెట్టు మొదట్లో ఆవనూనెతో దీపం వెలిగించి ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా జాతకంలో ఉన్న తీవ్ర పితృదోషాల ప్రభావం తొలగిపోతుంది. ఈ అమావాస్య నాడు పితృ పూజతో పాటు ఈశ్వరనామ స్మరణ చేయడం వల్ల సకల పాపాలు తొలగి ఇంట శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.