Srivari Mudupu: వేంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలా…ఈ తప్పు అస్సలు చేయొద్దు!

Srivari Mudupu:  భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాదిమంది భక్తులు తిరుమల చేరుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తే వారి కోరికలు తీరుస్తారని భావిస్తారు అందుకే భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారికి ముడుపు కట్టి కోరికలు కోరుకొని ఆ కోరిక నెరవేరిన అనంతరం తిరుమల చేరుకొని ఆ మడుపుల స్వామి వారి హుండీలో వేస్తూ ఉంటారు. అయితే చాలామంది స్వామివారికి ముడుపు కట్టే సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. మరి స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలి ముడుపు కట్టే సమయంలో చేయకూడని తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే..

శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి అనుకునేవారు శనివారం రోజున ఈ ముడుపు కట్టడం చాలా మంచిది. శనివారం ఉదయం నిద్ర లేచి తల స్నానం చేసి ఇంటిని అలాగే పూజగదిని శుభ్రం చేసుకోవాలి. స్వామివారి ముడుపు కట్టడం కోసం ఒక కొత్త తెల్లని వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు నీటిలో ముంచి బాగా ఆరనివ్వాలి. ఈ వస్త్రం ఆరిన తర్వాత నాలుగు మూలల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వస్త్రం పరిచి మధ్యలో 11 లేదా 21 లేదా 108 రూపాయల నాణేలు ఉంచాలి. ఇందులో 7యాలకులు, 7లవంగాలు,7ఎండు ఖర్జూరాలు ,కొద్దిగా పచ్చ కర్పూరం, జువ్వాడు, అక్షింతలు వేయాలి.

Tirumala tirupathi how to tie sri Venkateswara swamy mudupu in detail

Srivari Mudupu: ముడుపు ఎవరికి చూపించకూడదు..

ఇక ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత నా కోరిక నెరవేరాలి స్వామి అంటూ వస్త్రాన్ని మూట కట్టాలి. ప్రతి మూటకు మీ కోరికను చెప్పుకోవాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత ఆ వస్త్రం పై భాగంలో వెంకటేశ్వర స్వామి నామాలు బొట్టుగా పెత్తి ఆ వస్త్రాన్ని స్వామి వారి చిత్ర పటం ముందు ఉంచి తులసి దళాలలో అర్చన చేసి గోవింద నామాలు చదువుకోవాలి అనంతరం ముడుపుకు నైవేద్యం హారతులు ఇవ్వాలి. మీ కోరిక తీరిన తర్వాత ఈ ముడుపు తీసుకెళ్లి తిరుమలలోని స్వామివారి ఆలయంలోని హుండీలో వేయాలి. ముడుపు కట్టే సమయంలో, అలాగే ముడుపు బయటవారికి కనిపించకుండా జాగ్రత్త పడాలి.

Sravani

Recent Posts

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

9 hours ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

9 hours ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

1 day ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

1 day ago

Nagula Chavithi: నాగుల చవితి విశిష్టత.. పుట్టలో పాలు పోయడానికి గల కారణాలు?

Nagula Chavithi: నాగుల చవితి అనేది శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ చతుర్థి రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ…

4 days ago

Night Sleep: రాత్రి సరిగా నిద్రపోవడం లేదా? ఈ జబ్బులు మీ వెంటే జాగ్రత్త!

Night Sleep: ఈ రోజుల్లో చాలా మంది రాత్రి సరిగా నిద్ర రావడం లేదు అని బాధపడుతున్నారు. ఇలా రాత్రి…

4 days ago

This website uses cookies.