Health care: సాధారణంగా మనం మన ఆరోగ్యం పై దృష్టి సారించి ఎన్నో విధాలుగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కష్టపడుతూ ఉంటాము ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండడం కోసం ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటాము అలాగే సరైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటాము.
ఇకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇలా వ్యాయామం చేసేవారు సరైన సమయంలో వ్యాయామం చేస్తేనే మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాయామం చేయటానికి సరైన సమయం ఏంటి అనే విషయానికి వస్తే… వ్యాయామం చేసేవారు ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఉదయమే వ్యాయామం చేయటం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోయి మనం ఎంతో ఫిట్ గా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇకపోతే చాలా మంది సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు. సాయంత్రం కూడా వ్యాయామం చేయడానికి ముందు కడుపు ఖాళీగా ఉంచుకోవడం ఎంతో మంచిది అయితే వ్యాయామం చేయడానికి సరైన సమయం ఏది అనే విషయానికి వస్తే.. వ్యాయామం ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయవచ్చు కానీ సాయంత్రంతో పోలిస్తే ఉదయమే వ్యాయామం చేయటం వల్ల మరిన్ని అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.