Saturday: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక దేవుడిని పూజిస్తూ ఉంటాము వారంలో ప్రతిరోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. కనుక ప్రతి రోజు ఆ దేవుడికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే శనివారం శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. అలాగే హనుమంతుడు వెంకటేశ్వర స్వామిని కూడా శనివారం ఆరాధిస్తూ ఉంటారు.
ఇక శనీశ్వరుడు అంటేనే చెడు ఫలితాలను కలిగిస్తారని అందరూ భావిస్తారు అందుకే శని దేవుడికి కానీ నవగ్రహాలను పూజించడానికి కూడా ఇష్టపడరు. అయితే శని దేవుడు ఊరికే ఎవరికి శిక్షలు విధించరని మనం చేసిన పాపాలకు తగ్గ కర్మ ఫలితాన్ని అందిస్తారని చెప్పాలి. ఈ విధంగా శని దేవుడిని మనం భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించరు.
ఇక శనివారం తెల్లవారుజామున నువ్వుల నూనెతో స్నానం చేసి శనీశ్వరుడిని పూజించడం వల్ల శని గ్రహ దోషాలు మొత్తం తొలగిపోతాయి.నువ్వులను మూటకట్టి శనీశ్వరునకు సమర్పించి, నువ్వుల తైలంతో అభిషేకం చేయాలని అంటారు. ఇక శనివారం వీలైనంతవరకు నలుపు రంగు దుస్తులను దుప్పట్లను ఇతరులకు దానం చేయడం ఎంతో మంచిది అలాగే నువ్వుల నూనె కూడా ఇతరులకు దానం చేయడం వల్ల శనీశ్వరుని చల్లని కృప మనపై ఉంటుంది.నువ్వులు కలిపిన అన్నం కాకులకు పెట్టి , అనంతరం భోజనం చేయాలని కూడా చెబుతారు. ఇలా కాకులకు పెట్టడం వలన ఇబ్బందులు తొలగిపోయి సర్వ సౌఖ్యాలు లభిస్తాయని చెబుతారు.