Thu. Jul 10th, 2025

    Vithika Sheru : హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం, కుర్రాడు..వంటి సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని కలెక్షన్లతో షేక్ చేసిన హీరో వరుణ్ సందేశ్. ఈ పేరు అప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే పేరు. వరుస హిట్లు చూసిన వరుణ్ సందేశ్ స్టార్ స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుణ్ చేసిన సినిమాలన్నీ పరాజయాలు చూడటంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. రీసెంట్ గా బిగ్ బాస్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడేమో మరోసారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు ‘నింద’అనే థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు.

    vithika-sheru-emotional-comments-on-husband-varun-sandesh
    vithika-sheru-emotional-comments-on-husband-varun-sandesh

    రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాజేష్ జగన్నాథం డైరెక్షన్ లో ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా విడుదల కాబోతోంది. జూన్‌ 21న సినిమా రిలీజ్ అవుతుండటంతో మూవీ యూనిట్ తాజాగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక తన భర్త గురించి ఎమోషనల్‌ కామెంట్స్‌ చేసింది. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    vithika-sheru-emotional-comments-on-husband-varun-sandesh
    vithika-sheru-emotional-comments-on-husband-varun-sandesh

    ‘చాలా రోజుల తర్వాత వరుణ్‌ మూవీ ఈవెంట్ కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ‘నింద’ప్రమోషన్స్‌లో చాలా మంది వరుణ్ ని కెరీర్‌ ఫెయిల్యూర్‌పై క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు ఇండస్ట్రీ నుంచి ఛాన్సులు రావడం లేదు కదా.. మీరు ఫెయిల్డ్‌ యాక్టర్‌ కదా ఇలా అడుగుతున్నారు. నేను చెబుతున్నా నా భర్త ఫెయిల్యూర్‌ హీరో కాదు. ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో సినిమాలు చేశాడు. ఇక సినిమాలు వద్దు అని సినిమాలకు దూరంగా ఉన్న వాళ్లను ఫెయిల్యూర్‌ హీరో అని ఎలా అంటారు. వరుణ్‌ ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు.ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీ మూవీకి 100 శాతం న్యాయం చేస్తాడు. ‘నింద’మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా” అని వితిక ఎమోషనల్ అయ్యింది.

    vithika-sheru-emotional-comments-on-husband-varun-sandesh
    vithika-sheru-emotional-comments-on-husband-varun-sandesh

    ఇక వరుణ్ నింద మూవీ గురించి మాట్లాడుతూ…”ఇప్పటివరకు తెలుగులో 20కి పైగా సినిమాలు చేశాను. ఆ సినిమాలన్నింటి కంటే ఇది చాలా స్పెషల్‌. ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారు. ఇప్పటివరకు మూవీ చూసిన వారు బాగుందని అంటున్నారు. డైరెక్టర్ రాజేశ్‌ జగన్నాథం ఫ్యూచర్ లో గొప్ప సినిమాలు తీస్తారు. ‘నింద’ని అందరూ థియేటర్లో ఎంజాయ్ చేయండి”అని వరుణ్‌ కోరారు.